Southern Railway Apprentice Recruitment 2021 | సదరన్ రైల్వే 3378 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
భారతీయ రైల్వేలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB తో పాటు భారతీయ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్స్, రైల్వే జోన్లు ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటాయి. అందులో భాగంగా సదరన్ రైల్వే 3378 పోస్టుల్ని భర్తీకి ఇటీవల ప్రకటన జారీ చేసింది. జూన్ 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. సదరన్ రైల్వే జోన్ పరిధిలోని పెరంబూర్, పొడనూర్‌లోని వర్క్‌షాప్‌లల్లో 3378 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇందుకోసం మూడు నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, మెడికల్ ల్యాబరేటరీ టెక్నీషియన్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, టర్నర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది సదరన్ రైల్వే. ఆసక్తి గల అభ్యర్థులు 2021 జూన్ 30 లోగా అప్లై చేయాలి.
తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, పుదుచ్చెరీ, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలు, కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలకు చెందినవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు. సదరన్ రైల్వే అధికారిక వెబ్‌సైట్ https://sr.indianrailways.gov.in/ లో మూడు నోటిఫికేషన్లు వేర్వేరుగా ఉన్నాయి. అభ్యర్థులు అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
Southern Railway Apprentice Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే
మొత్తం ఖాళీలు- 3378
- క్యారేజ్ వర్క్స్, పెరంబూర్- 936
- గోల్డెన్‌రాక్ వర్క్‌షాప్- 756
- సిగ్నల్ అండ్ టెలికామ్ వర్క్‌షాప్- 1686
Southern Railway Apprentice Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 జూన్ 1
- దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూన్ 30 సాయంత్రం 5 గంటలు
- విద్యార్హతలు- టెన్త్ క్లాస్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
- వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు
- దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు
Southern Railway Apprentice Recruitment 2021: దరఖాస్తు విధానం ఇదే
- అభ్యర్థులు ముందుగా https://sr.indianrailways.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో News & Updates సెక్షన్‌లో Personnel Branch Information ఉంటుంది.
- అందులో Engagement of Act Apprentices 2021-22 పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- అందులో పెరంబూర్‌లోని క్యారేజ్ వర్క్స్, గోల్డెన్‌రాక్ వర్క్‌షాప్, పొడనూరులోని సిగ్నల్ అండ్ టెలికామ్ వర్క్‌షాప్ నోటిఫికేషన్లు వేర్వేరుగా ఉంటాయి.
- REGISTER పైన క్లిక్ చేసి, యూనిట్ సెలెక్ట్ చేసుకొని దరఖాస్తు చేయాలి.
- దరఖాస్తు ప్రక్రియ పూర్తైన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
No comments:
Post a Comment