PAN-Aadhar Link Status | పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడానికి మార్చి 31 చివరి తేదీ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈ తేదీని పొడిగించే పరిస్థితి కనిపించట్లేదు. మరి మీ ఆధార్ నెంబర్ పాన్ కార్డుతో లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోవచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అవండి.
PAN-Aadhaar Link Process: మార్చి 31 చివరి తేదీ
Realme Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ డేస్ సేల్ ప్రారంభం
1. పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడానికి ఇప్పటికే అనేక సార్లు గడువు ఇచ్చింది ఆదాయపు పన్ను శాఖ. ఏకంగా 8 సార్లు చివరి తేదీలను పొడిగించింది. ఈసారి మార్చి 31 డెడ్‌లైన్ అని స్పష్టం చేసింది. ఇందులో మార్పు ఉండకపోవచ్చు.
2. ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవాళ్లలో చాలామంది తమ ఆధార్ నెంబర్‌ను లింక్ చేశారు. ఇంకా లింక్ చేయనివాళ్లున్నారు. అయితే తమ ఆధార్ నెంబర్ పాన్ కార్డుతో లింక్ అయిందా లేదా అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి.
Amazon Smartphone Upgrade Days sale
3. మీరు గతంలో పాన్-ఆధార్ లింక్ చేసినట్టైతే స్టేటస్ తెలుసుకోవడం చాలా సులువు. కేవలం 30 సెకన్లలో పాన్-ఆధార్ లింక్ స్టేటస్ తెలిసిపోతుంది. ఇందుకోసం మీ దగ్గర మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ సిద్ధంగా ఉంటే చాలు.
4. ముందుగా మీరు https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/AadhaarPreloginStatus.html ఈ లింక్ మీ బ్రౌజర్‌లో ఓపెన్ చేయాలి. పాన్-ఆధార్ లింక్ స్టేటస్ తెలుసుకునే పేజీ ఓపెన్ అవుతుంది.
5. PAN అని ఉన్న చోట బాక్సులో మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. Aadhaar Number అని ఉన్న చోట బాక్సులో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓసారి రెండు నెంబర్లు సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.
6. ఆ తర్వాత View Link Aadhaar Status పైన క్లిక్ చేస్తే మీరు మీ పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేశారో లేదో తెలుస్తుంది. ఆధార్ లింక్ చేసినట్టు చూపిస్తే ఇక మీరు మళ్లీ లింక్ చేయాల్సిన అవసరం లేదు.
Nice
ReplyDelete