NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Mar 29, 2021

Internship: డిగ్రీ పాసైనవారికి నెలకు రూ.10,000 స్టైపెండ్‌తో ఇంటర్న్‌షిప్

  NewNotifications       Mar 29, 2021

Internship | రాజ్యసభలో ఇంటర్న్‌షిప్, ఫెలోషిప్ కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి మరో 3 రోజులే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

1. డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్. భారత పార్లమెంట్ రాజ్యసభలో ఇంటర్న్‌షిప్, ఫెలోషిప్ ప్రకటించింది. రాజ్యసభ స్టూడెంట్ రీసెర్చ్ అండ్ స్టడీ స్కీమ్-RSRS దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డీఎస్ రాధాకృష్ణన్ చెయిర్ ఫెలోషిప్, స్టూడెంట్ ఎంగేజ్‌మెంట్ ఇంటర్న్‌షిప్‌కు డిగ్రీ లేదా పీజీ పాస్ అయిన విద్యార్థులు ఈ అప్లై చేయొచ్చు. 

Amazon Smartphone Upgrade Days sale

2. వేసవి సెలవుల్లో ఈ ఇంటర్న్‌షిప్, ఫెలోషిప్ చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. ఫెలోషిప్ మొదట రెండేళ్లు ఉంటుంది. ఆ తర్వాత మరో ఏడాది పొడిగిస్తారు. ఇక ఇంటర్న్‌షిప్ మొదట 18 నెలలు ఉంటుంది. ఆ తర్వాత మరో 6 నెలలు పొడిగిస్తారు.

 Realme Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ డేస్ సేల్ ప్రారంభం

3. ఫెలోషిప్ గ్రాంట్ ఏడాదికి రూ.8,00,000 లభిస్తుంది. దీంతో పాటు రూ.50,000 కాంటింజెన్సీ గ్రాంట్ కూడా లభిస్తుంది. ఇక ఇంటర్న్‌షిప్‌కు నెలకు రూ.10,000 లభిస్తుంది. ఇంటర్న్‌షిప్ పూర్తి చేసినవారికి సర్టిఫికెట్ లభిస్తుంది.


4. ఫెలోషిప్ ఖాళీలు 4, ఇంటర్న్‌షిప్ ఖాళీలు 10 ఉన్నాయి. గ్రాడ్యుయేట్స్‌కి 5, పోస్ట్ గ్రాడ్యుయేట్స్‌కి 5 పోస్టులు కేటాయించారు. ఈ ఫెలోషిప్, ఇంటర్న్‌షిప్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://rajyasabha.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Amazon Smartphone Upgrade Days sale

5. విద్యార్హతల వివరాలు చూస్తే ఇంటర్న్‌షిప్ కోసం ఏదైనా డిగ్రీ లేదా పీజీ పాస్ కావాలి. ఫెలోషిప్ కోసం పీహెచ్‌డీ పాస్ కావాలి. ఇంటర్న్‌షిప్ గడువు 18 నెలలు. ఫెలోషిప్ గడువు 2 ఏళ్లు.

 Realme Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ డేస్ సేల్ ప్రారంభం

6. ఆసక్తి గల విద్యార్థులు https://rajyasabha.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి ఇమెయిల్ ద్వారా పంపాలి. రాజ్యసభ ఫెలోషిప్ దరఖాస్తుల్ని rksahoo.rs@sansad.nic.in మెయిల్ ఐడీకి, ఇంటర్న్‌షిప్ దరఖాస్తుల్ని rssei.rsrs@sansad.nic.in మెయిల్ ఐడీకి పంపాలి.

logoblog

Thanks for reading Internship: డిగ్రీ పాసైనవారికి నెలకు రూ.10,000 స్టైపెండ్‌తో ఇంటర్న్‌షిప్

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...