NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Jan 25, 2021

National Voters corrections

  NewNotifications       Jan 25, 2021

National Voters Day: ఓటర్ ఐడీ కార్డులో తప్పులను 5 నిమిషాల్లో సరిచేయండిలా

National Voters Day | ఈ రోజు నేషనల్ ఓటర్స్ డే. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. మీ ఓటర్ కార్డులో ఏవైనా తప్పులు ఉన్నాయా? పేరు, అడ్రస్, ఇతర వివరాలు అప్‌డేట్ చేయాలా? కేవలం 5 నిమిషాల్లో సరిచేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

మీ దగ్గర ఓటర్ ఐడీ కార్డు ఉందా? మీ ఓటర్ ఐడీ కార్డులో తప్పులున్నాయా? పేరు, పుట్టిన తేదీ, వయస్సు, తండ్రిపేరు, అడ్రస్ లాంటి వివరాలు సరిగ్గా లేవా? మీరు మీ ఓటర్ ఐడీ కార్డులో తప్పుల్ని సరిచేసుకోవడానికి ఎక్కడికీ తిరగాల్సిన అవసరం లేదు. మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ లేదా ఇంట్లో కంప్యూటర్ ఉంటే చాలు. 5 నిమిషాల్లో తప్పుల్ని సరిచేసుకోవచ్చు. టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ అవకాశం ఇస్తోంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా-ECI. నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ https://www.nvsp.in/ లో మీ ఓటర్ ఐడీ కార్డులోని తప్పుల్ని సులువుగా సరిచేసుకోవచ్చు. మరి మీ ఓటర్ ఐడీ కార్డులో పేరు, పుట్టిన తేదీ, వయస్సు, అడ్రస్ లాంటి వివరాలను ఎలా సరిచేయాలో తెలుసుకోండి.

NEW_NOTIFICATIONS

Voter ID Correction: ఓటర్ ఐడీ కార్డులో తప్పుల్ని సరిచేయండిలా

  • ముందుగా https://www.nvsp.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
  • హోమ్ పేజీలో ఎడమవైపు Login/Register పైన క్లిక్ చేయండి.
  • కొత్త యూజర్ అయితే Register as New user పైన క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
  • Send OTP పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసిన తర్వాత మీ ఓటర్ ఐడీ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి.
  • పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోండి. మీ అకౌంట్ క్రియేట్ అవుతుంది.
  • అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత లాగిన్ చేయాలి.
  • లాగిన్ చేసిన తర్వాత Click on Correction in Personal Details పైన క్లిక్ చేయండి.
  • మీ రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం సెలెక్ట్ చేయండి.
  • మీ పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, ఫోటో లాంటి వివరాలు అప్‌డేట్ చేయొచ్చు.
  • మీ వివరాలు అప్‌డేట్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • చివరగా సబ్మిట్ చేసిన తర్వాత రిఫరెన్స్ ఐడీ వస్తుంది.
  • రిఫరెన్స్ ఐడీ ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

Voter ID Correction: అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయండి ఇలా

  • మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసేందుకు https://www.nvsp.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
  • హోమ్ పేజీలో కుడివైపు Track Application Status పైన క్లిక్ చేయండి.
  • Enter reference id దగ్గర మీ రిఫరెన్స్ ఐడీ ఎంటర్ చేయండి.
  • Track Status పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ స్టేటస్ తెలుస్తుంది.

logoblog

Thanks for reading National Voters corrections

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...