UIDAI Recruitment 2021 | యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
భారత పౌరులకు ఆధార్ కార్డు సేవల్ని అందిస్తున్న యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ముంబై, బెంగళూరు, గువాహతిలోని ప్రాంతీయ కార్యాలయాల్లో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ప్రైవేట్ సెక్రెటరీ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, అకౌంటెంట్ లాంటి పోస్టులు ఉన్నాయి. డిప్యూటేషన్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది UIDAI. డిప్యూటేషన్ మూడేళ్లు ఉంటుంది. సంస్థ అవసరాలను బట్టి ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 జూలై 16 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే దరఖాస్తుల్ని పోస్టు ద్వారా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపించాలి.
UIDAI Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే
మొత్తం ఖాళీలు- 25
- డిప్యూటీ డైరెక్టర్- 3
- సెక్షన్ ఆఫీసర్- 5
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్- 5
- సీనియర్ అకౌంట్ ఆఫీసర్- 1
- అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్- 1
- అకౌంటెంట్- 2
- ప్రైవేట్ సెక్రెటరీ- 6
- స్టెనో- 2
UIDAI Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- దరఖాస్తు ప్రారంభం- 2021 మే 17
- దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 16
- విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
- వయస్సు- 18 నుంచి 56 ఏళ్లు
- ఎంపిక విధానం- విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
UIDAI Recruitment 2021: దరఖాస్తు విధానం
- అభ్యర్థులు https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేయాలి.
- ముంబై, బెంగళూరు, గువాహతి ప్రాంతీయ కార్యాలయాల్లో పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు ఉన్నాయి.
- దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి పోస్టులో పంపాలి.
- దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్‌లు కూడా వేర్వేరుగా ఉన్నాయి.
- Bengaluru: Assistant Director General (HR), Unique Identification Authority of India (UIDAI), Regional Office, 3rd Floor, South Wing, Khanija Bhavan, No. 49, Race Course Road, Bengaluru 560001.
- Mumbai: Assistant Director General (HR), Unique Identification Authority of India (UIDAI), Regional Office, 7th Floor, MTNL Telephone Exchange, GD Somani Marg, Cuffe Parade, Colaba, Mumbai – 400 005.
- Guwahati: Assistant Director General (HR), Unique Identification Authority of India (UIDAI), Regional Office, Block-V, 1 st Floor, Housefed Complex, Dispur, Guwahati -781006.
No comments:
Post a Comment