NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Feb 9, 2021

mAadhaar యాప్ వాడుతున్నవారికి అలర్ట్... డిలిట్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి... ఎందుకంటే

  SSK       Feb 9, 2021

mAadhaar యాప్ వాడుతున్నవారికి అలర్ట్... డిలిట్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి... ఎందుకంటే

UIDAI ASKS AADHAAR CARD HOLDERS TO UNINSTALL ANY PREVIOUSLY INSTALLED MAADHAAR APP VERSIONS AND DOWNLOAD LATEST VERSION KNOW WHY 

mAadhaar App | మీరు mAadhaar యాప్ వాడుతున్నారా? అయితే వెంటనే పాత వర్షన్ డిలిట్ చేసి కొత్త వర్షన్ ఇన్‌స్టాల్ చేయమని కోరుతోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI.

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI రూపొందించిన mAadhaar యాప్‌ను మీరు వాడుతున్నారా? అయితే వెంటనే ఆ యాప్ డిలిట్ చేయండి. మళ్లీ కొత్తగా యాప్ ఇన్‌స్టాల్ చేయండి. మీరు ఆండ్రాయిడ్ యూజర్లు అయితే ఇక్కడ క్లిక్ చేసి యాప్ ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఐఓఎస్ యూజర్లు అయితే ఇక్కడ క్లిక్ చేయండి. గతంలో ఇన్‌స్టాల్ చేసిన mAadhaar యాప్‌ను డిలిట్ చేసి కొత్తగా మళ్లీ ఇన్‌స్టాల్ చేయాలని కోరుతోంది UIDAI. ఇటీవల mAadhaar యాప్‌ ఫీచర్స్‌లో పలు మార్పుల్ని చేసింది UIDAI. అందుకే సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు వెంటనే పాత యాప్ డిలిట్ చేసి ప్లేస్టోర్, యాప్ స్టోర్ నుంచి కొత్త యాప్ ఇన్‌స్టాల్ చేయాలని కోరుతోంది. మీరు ఇటీవల కాకుండా గతంలో mAadhaar యాప్‌ డౌన్‌లోడ్ చేసి ఉపయోగిస్తున్నట్టైతే అన్‌ఇన్‌స్టాల్ చేయండి. కొత్తగా mAadhaar యాప్‌ డౌన్‌లోడ్ చేసి ఉపయోగించండి.

 Aadhaar Card: ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా? ఇలా మార్చేయండి

 Aadhaar Card: ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ ఆన్‌లైన్‌లోనే మార్చేయండి ఇలా

mAadhaar App: ఫీచర్స్ ఇవే...

ఆధార్ కార్డ్ హోల్డర్లకు ఆన్‌లైన్‌లోనే సేవలు అందించేందుకు mAadhaar యాప్‌ను రూపొందించింది UIDAI. ఈ యాప్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సహా మొత్తం 13 భాషల్లో ఉపయోగించొచ్చు. mAadhaar యాప్‌ ద్వారా 35 రకాల ఆధార్ సేవల్ని అందిస్తోంది UIDAI. యాప్‌లో Main Service Dashboard, Request Status Services, My Aadhaar లాంటి ఫీచర్స్ ఉంటాయి. ఆధార్ ప్రొఫైల్‌లో రిజిస్టర్ చేసి ఆధార్ సేవలు పొందొచ్చు. ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్, రీప్రింట్, స్కాన్ క్యూఆర్ కోడ్, ఇకేవైసీ డౌన్‌లోడ్, అడ్రస్ అప్‌డేట్, వెరిఫై ఆధార్, వెరిఫై ఇమెయిల్, రిట్రీవ్ యూఐడీ లేదా ఈఐడీ, అడ్రస్ వ్యాలిడేషన్ లెటర్ లాంటి 35 రకాల సేవల్ని mAadhaar యాప్‌లో పొందొచ్చు.

 Aadhaar Card: ఆధార్ నెంబర్ మర్చిపోయారా? సింపుల్‌గా 3 నిమిషాల్లో తెలుసుకోండి ఇలా

 Aadhaar PVC Card: విజిటింగ్ కార్డు సైజులో ఆధార్ కార్డ్ తీసుకోండి... మీరూ ఆర్డర్ చేయొచ్చు ఇలా

mAadhaar యాప్‌లో మూడు ప్రొఫైల్స్ యాడ్ చేయొచ్చు. అంటే ఇంట్లో ఒకరు యాప్ డౌన్‌లోడ్ చేసి కుటుంబ సభ్యుల ప్రొఫైల్స్ యాడ్ చేయొచ్చు. వారి ఆధార్ సేవల్ని కూడా పొందొచ్చు. ఎక్కడైనా ఆధార్ కార్డును ఐడీ ప్రూఫ్‌గా చూపించాలనుకుంటే mAadhaar యాప్‌లోని ఆధార్ కార్డును చూపించొచ్చు. రైలు ప్రయాణం సందర్భంలో కూడా ఎంఆధార్ యాప్‌లోని ఆధార్ కార్డును ఐడీ ప్రూఫ్‌గా చూపించొచ్చు.

 Aadhaar Card: మీ ఆధార్ కార్డుకు లింక్ చేసిన మొబైల్ నెంబర్ ఏదో 2 నిమిషాల్లో తెలుసుకోండిలా

logoblog

Thanks for reading mAadhaar యాప్ వాడుతున్నవారికి అలర్ట్... డిలిట్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి... ఎందుకంటే

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...