Aadhaar Card Update | ఆధార్ కార్డులో వివరాలు మార్చాలన్నా, అప్‌డేట్ చేయాలన్నా గతంలో ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చాలావరకు మార్పులు ఆన్‌లైన్‌లోనే చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
1. ఆధార్ కార్డ్ హోల్డర్లకు శుభవార్త. ఇక మీరు అన్ని పనులకు ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. చాలావరకు మార్పులు ఆన్‌లైన్‌లోనే చేయొచ్చు. ప్రస్తుతం ఆధార్ కార్డు ముఖ్యమైన డాక్యుమెంట్ అన్న సంగతి తెలిసిందే. అయితే ప్రజలు తమ ఆధార్ కార్డుల్లో మార్పులు చేయిస్తూ ఉంటారు.2. ఇందుకోసం ఆధార్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అవసరం. అందుకే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఆన్‌లైన్‌లోనే అనేక సేవల్ని ప్రారంభించింది.
3. ఆధార్ కార్డ్ హోల్డర్లు ఇంట్లో నుంచే అనేక సేవలు పొందొచ్చు. అయితే కొన్ని సేవల కోసం ఆధార్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లక తప్పదు. మరి ఏఏ సేవల్ని ఆన్‌లైన్‌లో పొందొచ్చో తెలుసుకోండి.
ఆధార్ నెంబర్ మర్చిపోయారా? సింపుల్‌గా 3 నిమిషాల్లో తెలుసుకోండి ఇలా.
4. మీరు మీ పేరు మార్చాలనుకుంటున్నారా? పుట్టిన తేదీలో మార్పు ఉందా? ఆన్‌లైన్‌లో మార్చొచ్చు. ఇవి మాత్రమే కాదు జెండర్, అడ్రస్, ఆధార్ కార్డుపై ఉన్న భాషల్ని మీరు ఆన్‌లైన్‌లోనే సులువుగా మార్చొచ్చు.
5. అయితే బయోమెట్రిక్ అప్‌డేట్ లాంటి కీలక సమాచారాన్ని అప్‌డేట్ చేయాలంటే మాత్రం ఆధార్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సిందే. మీరు ఆధార్ కార్డులో ఏ మార్పు చేయాలన్నా ఓటీపీ తప్పనిసరి.
ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా? ఇలా మార్చేయండి...
6. ఇందుకోసం మీరు మీ మొబైల్ నెంబర్‌ను ఆధార్ సెంటర్‌లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆధార్ ఆథెంటికేషన్ కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఇమెయిల్ ఐడీ కూడా అప్‌డేట్ చేయించొచ్చు.
7. ఆధార్ కార్డులో వివరాలు అప్‌డేట్ చేయడానికి ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయాలి. Update Aadhaar సెక్షన్‌లో Update Demographics Data Online పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Proceed to update Aadhaar పైన క్లిక్ చేయాలి.
Aadhaar PVC Card: విజిటింగ్ కార్డు సైజులో ఆధార్ కార్డ్ తీసుకోండి... మీరూ ఆర్డర్ చేయొచ్చు ఇలా..
8. ఆ తర్వాత ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Sent OTP పైన క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి Login పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Update Damographic Data, Update Address via Secret Code పైన క్లిక్ చేయాలి.
9. Update Damographic Data పైన క్లిక్ చేసిన తర్వాత Language, Name, Gender, Date of Birth, Address, Mobile Number, Email అప్‌డేట్ చేయొచ్చు. మీరు మార్చాలనుకున్న వివరాలు అప్‌డేట్ చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఆన్‌లైన్‌లో రూ.50 చెల్లించాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు యూఆర్ఎన్ కోడ్ వస్తుంది. ఈ కోడ్ ద్వారా అప్‌డేట్ స్టేటస్ ట్రాక్ చేయొచ్చు.
10. ఈ వివరాలు అప్‌డేట్ చేసేముందు ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఈ వివరాల్లో పేరును 2 సార్లు, జెండర్‌ను 1 సారి, పుట్టిన తేదీని 1 సారి మాత్రమే అప్‌డేట్ చేసే అవకాశం ఉంటుంది. పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ అప్‌డేట్ చేయడానికి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి.
No comments:
Post a Comment