NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Jan 23, 2021

SSC CGL Notification 2021

  SSK       Jan 23, 2021

SSC CGL Notification 2021: డిగ్రీ పాసయ్యారా? 6506 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సిద్ధంగా ఉన్నాయి... సిలబస్ ఇదే

SSC CGL Notification 2021

SSC CGL Notification 2021 | డిగ్రీ అర్హతతో పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC. ఏకంగా 6506 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  •  డిగ్రీ పాసయ్యారా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకుంటున్నారా? స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్-CGL నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 6506 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
  •  డిగ్రీ అర్హతతో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. డిగ్రీ పాసైనవారు ఎవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. అప్లై చేయడానికి 2021 జనవరి 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ లో తెలుసుకోవచ్చు.
  •  ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా నిర్వహించే పరీక్షలు, సిలబస్ విషయంలో అభ్యర్థులకు సందేహాలు ఉన్నాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో, పరీక్షల కోసం ప్రిపేర్ కావాల్సిన సిలబస్ ఏంటో తెలుసుకోండి.
  •  నాలుగు దశల పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC. మొదటి దశ, రెండో దశలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మూడో దశలో డిస్క్రిప్టీవ్ పేపర్ పెన్ అండ్ పేపర్ మోడ్‌లో ఉంటుంది. ఇక నాలుగో దశలో కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ లేదా డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ ఉంటుంది.
  •  సిలబస్ వివరాలు చూస్తే మొదటి దశలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటీవ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ టాపిక్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో వర్బల్, నాన్ వర్బల్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. అనలాజీస్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, స్పాటియల్ ఓరియెంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎనాలసిస్, జడ్జ్‌మెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమొరి, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్‌‌షిప్ కాన్సెప్ట్స్, ఆర్థమెటికల్ రీజనింగ్ అండి ఫిగరల్ క్లాసిఫికేషన్, ఆర్థమెటిక్ నెంబర్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్, స్టేట్‌మెంట్ కన్‌క్లూజన్, సిల్లాజిస్టిక్ రీజనింగ్ లాంటి అంశాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి.
  • ఇక జనరల్ అవేర్‌నెస్‌లో భారతదేశంతో పాటు పొరుగు దేశాల చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఆర్థిక వ్యవస్థ, జనరల్ పాలసీ, సైంటిఫిక్ రీసెర్చ్‌కు సంబంధించిన ప్రశ్నలుంటాయి.
  •  ఇక క్వాంటిటేటీవ్ యాప్టిట్యూడ్‌లో నంబర్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, రిలేషన్‌షిప్స్, పర్సెంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, పార్ట్‌నర్‌షిప్ బిజినెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైమ్ అండ్ వర్క్ లాంటి అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి.
  •  ఇంగ్లీష్ కాంప్రహెన్షన్‌లో అభ్యర్థులు ఇంగ్లీష్ సరిగ్గా అర్థం చేసుకుంటున్నారా, రాయగలుగుతున్నారా అన్న అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ ఏ, బీ, డీలో డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు, పార్ట్ సీలో 10వ తరగతి స్థాయి ప్రశ్నలు ఉంటాయి.  
Amazon Great Republic Day Sale: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్లో ఆఫర్ల వెల్లువ.. రూ .2,000 లోపు లభించే 20 గాడ్జెట్లు ఇవే-Click Here
logoblog

Thanks for reading SSC CGL Notification 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...