Airports Authority of India (AAI) Recruitment 2021: గుడ్ న్యూస్... ఎయిర్‌పోర్ట్ అథారిటీలో 368 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు
AAI Recruitment 2021 | ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-AAI ఓ జాబ్ నోటిఫికేషన్ దరఖాస్తు గడువు పెంచింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-AAI గత నెలలో 368 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌కు అప్లై చేయడానికి 2021 జనవరి 14 చివరి తేదీ అని నోటిఫికేషన్‌లో ప్రకటించింది. అయితే మేనేజర్ టెక్నికల్ పోస్టుకు అర్హతల్లో స్వల్ప మార్పులు చేసింది. దీంతో దరఖాస్తు గడువును పొడిగించింది. ఆసక్తి గల అభ్యర్థులు 2021 జనవరి 29 లోగా అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-AAI. అభ్యర్థులు http://www.aai.aero/ వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ప్రతీ పోస్టుకు విద్యార్హతలతో పాటు అనుభవం కూడా ఉండాలి. అభ్యర్థులు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-AAI అధికారిక వెబ్‌సైట్ http://www.aai.aero/ లో ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి.
AAI Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 368
మేనేజర్ (ఫైర్ సర్వీసెస్)- 11
మేనేజర్ (టెక్నికల్)- 02
జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)- 264
జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్)- 83
జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (టెక్నికల్)- 8
AAI Recruitment 2020: విద్యార్హతల వివరాలు ఇవే...
- మేనేజర్ (ఫైర్ సర్వీసెస్)- ఫైర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో బీఈ లేదా బీటెక్.
- మేనేజర్ (టెక్నికల్)- మెకానికల్ లేదా ఆటోమొబైల్‌లో బీఈ లేదా బీటెక్.
- జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)- ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో మూడేళ్ల బీఎస్సీ లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ. ఏదైనా ఓ సెమిస్టర్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ తప్పనిసరి.
- జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్)- సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌తో పాటు రెండేళ్ల ఎంబీఏ. లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ.
- జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (టెక్నికల్)- మెకానికల్ లేదా ఆటోమొబైల్‌లో బీఈ లేదా బీటెక్.
AAI Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 15
- దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 29
- వేతనం- మేనేజర్‌కు ఏడాదికి రూ.18 లక్షలు, జూనియర్ ఎగ్జిక్యూటీవ్‌కు ఏడాదికి రూ.12 లక్షలు
- వయస్సు- 2020 నవంబర్ 30 నాటికి మేనేజర్ పోస్టుకు 32 ఏళ్లు. జూనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుకు 27 ఏళ్లు.
- దరఖాస్తు ఫీజు- రూ.1000. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజు రూ.170 మాత్రమే.
No comments:
Post a Comment