NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Oct 13, 2021

ONGC Recruitment 2021: ఓఎన్‌జీసీలో 309 ఉద్యోగాలు

  SSK       Oct 13, 2021

ONGC Recruitment 2021 | వేర్వేరు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్‌లో బీటెక్ పాస్ అయినవారితో పాటు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయినవారికి అలర్ట్. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. వేర్వేరు విభాగాల్లో గ్రాడ్యుయేట్ ట్రైనీ (Graduate Trainee) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 309 ఖాళీలు ఉన్నాయి. ఇంజనీరింగ్, జియో సైన్స్ డిసిప్లిన్స్‌లో ఈ పోస్టులు ఉన్నాయి. గ్రేట్ 2021 స్కోర్ ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 1 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. ఓఎన్‌జీసీ రిలీజ్ చేసిన ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతల వివరాలు తెలుసుకోండి.

Amazon: Great Indian Festival Days

ONGC Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే

మొత్తం ఖాళీలు 309 విద్యార్హతలు

  •  ఏఈఈ (సిమెంటింగ్) మెకానికల్ 6 మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌తో గ్రాడ్యుయేట్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి.
  •  ఏఈఈ (సిమెంటింగ్) పెట్రోలియం 1 పెట్రోలియం ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌తో గ్రాడ్యుయేట్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి.
  •  ఏఈఈ (సివిల్) 18 సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌తో గ్రాడ్యుయేట్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి.
  •  ఏఈఈ (డ్రిల్లింగ్) మెకానికల్ 28 మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌తో గ్రాడ్యుయేట్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి.
  •  ఏఈఈ (ఎలక్ట్రికల్) 40 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌తో గ్రాడ్యుయేట్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి.
  •  ఏఈఈ (ఎలక్ట్రానిక్స్) 5 టెలికామ్, ఎలక్ట్రానిక్స్, ఈ అండ్ టీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌తో గ్రాడ్యుయేట్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. లేదా ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్‌తో పీజీ పాస్ కావాలి.
  •  ఏఈఈ (ఇన్‌స్ట్రుమెంటేషన్) 32 ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌తో గ్రాడ్యుయేట్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి.
  •  ఏఈఈ (మెకానికల్) 33 మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌తో గ్రాడ్యుయేట్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి.
  •  ఏఈఈ (ప్రొడక్షన్) మెకానికల్ 15 మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌తో గ్రాడ్యుయేట్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి.
  •  ఏఈఈ (ప్రొడక్షన్) కెమికల్ 16 కెమికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌తో గ్రాడ్యుయేట్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి.
  •  ఏఈఈ (ప్రొడక్షన్) పెట్రోలియం 12 పెట్రోలియం ఇంజనీరింగ్, అప్లైడ్ పెట్రోలియం సబ్జెక్ట్‌తో గ్రాడ్యుయేట్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి.
  •  ఏఈఈ (ఎన్విరాన్‌మెంట్) 5 ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంట్ సైన్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌తో గ్రాడ్యుయేట్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి.
  •  ఏఈఈ (రిజర్వాయర్) 9 జియాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, పెట్రోలియం టెక్నాలజీ, జియోఫిజిక్స్ సబ్జెక్ట్స్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ కావాలి.
  •  కెమిస్ట్ 14 కెమిస్ట్ సబ్జెక్ట్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ కావాలి.
  •  జియాలజిస్ట్ 19 జియాలజీ, పెట్రోలియం జియోసైన్స్, పెట్రోలియం జియాలజీ, జియలాజికల్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ కావాలి.
  •  జియోఫిజిస్ట్ (సర్‌ఫేస్) 24 జియోఫిజిక్స్, జియోఫిజికల్, ఫిజిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ కావాలి.
  •  జియోఫిజిస్ట్ (వెల్స్) 11 జియోఫిజిక్స్, జియోఫిజికల్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ కావాలి.
  •  మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్ 13 ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ కావాలి.
  •  ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ 8 మెకానికల్ ఇంజీరింగ్, ఆటో ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ కావాలి.


ONGC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

  • దరఖాస్తు ప్రారంభం- 2021 అక్టోబర్ 11
  • దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 1
  • విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు గేట్ 2021 స్కోర్ ఉండాలి.
  • దరఖాస్తు ఫీజు- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
  • Notification: Click Here
  • Apply Here


logoblog

Thanks for reading ONGC Recruitment 2021: ఓఎన్‌జీసీలో 309 ఉద్యోగాలు

Newest
You are reading the newest post

No comments:

Post a Comment

More ...