Oil India Limited Recruitment 2021 | ఇంటర్, ఐటీఐ పాస్ అయినవారికి గుడ్ న్యూస్. ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India Limited) 535 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్వహిస్తున్న పనుల కోసం పలు పోస్టుల్ని Oil India Limited భర్తీ చేస్తోంది. అస్సాంలోని దులియాజన్‌లో గల ఫీల్డ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ పోస్టులున్నాయి. మొత్తం 535 ఖాళీలను భర్తీ చేస్తోంది ఆయిల్ ఇండియా లిమిటెడ్. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 23 చివరి తేదీ. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. ఖాళీల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మొత్తం ఖాళీలు 535
- ఎలక్ట్రీషియన్ 38
- ఫిట్టర్ 144
- మెకానిక్ మోటార్ వెహికిల్ 42
- మెషినిస్ట్ 13
- మెకానిక్ డీజిల్ ట్రేడ్ 97
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్ 40
- బాయిలర్ అటెండెంట్ 8
- టర్నర్ 4
- డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్ 8
- ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ 81
- ఎంపీసీ 44
- సర్వేయర్ 5
- వెల్డర్ 6
- ఐటీ ట్రేడ్ 5
Oil India Limited Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- Application begins- 2021 ఆగస్ట్ 24
- Application Last Date- 2021 సెప్టెంబర్ 23
- Educational Qualifications- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయినవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
- Age- జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 30 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 18 నుంచి 33 ఏళ్లు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్లు.
- Application Fees- జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.200. ఎస్‌సీ, ఎస్‌టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
- Selection Process- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.
Oil India Limited Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా
- Step 1- అభ్యర్థులు ముందుగా https://www.oil-india.com/default.aspx వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- Step 2- హోమ్ పేజీలో కెరీర్స్ సెక్షన్‌లో Current Openings పైన క్లిక్ చేయాలి.
- Step 3- ఆ తర్వాత Apply Online పైన క్లిక్ చేయాలి.
- Step 4- ఆ తర్వాత అప్లై చేయాలనుకునే పోస్టు పేరు సెలెక్ట్ చేయాలి.
- Step 5- పేరు, ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- Step 6- Continue క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీకి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.
- Step 7- ఆ తర్వాత బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.
- Step 8- తర్వాతి సెక్షన్‌లో విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
- Step 9- తర్వాతి సెక్షన్‌లో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ వివరాలు ఎంటర్ చేయాలి.
- Step 10- తర్వాతి సెక్షన్‌లో డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
- Step 11- చివరగా ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
- Step 12- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
అభ్యర్థులు పైన చెప్పిన స్టెప్స్‌తో ఆయిల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లోనే దరఖాస్తు చేయాలి. ఆయిల్ ఇండియా లిమిటెడ్ జారీ చేసిన జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అప్లికేషన్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.oil-india.com/Current_openNew.aspx లింక్‌లో తెలుసుకోవచ్చు.
No comments:
Post a Comment