భారత ప్రభుత్వానికి చెందిన ముంబైలోని ఇన్‌కంటాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కార్యాలయం.. 2021 సంవత్సరానికి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsమొత్తం పోస్టుల సంఖ్య: 155 (ఇన్‌కంటాక్స్ ఇన్‌స్పెక్టర్–08, టాక్స్ అసిస్టెంట్–83, మల్టీటాస్కింగ్ స్టాఫ్–64).
స్పోర్ట్స్: అథ్లెటిక్స్, స్విమ్మింగ్, స్వాష్, బిలియర్డ్స్, చెస్, క్యారం, బ్రిడ్జ్, బ్యాడ్మింటన్, లాన్‌టెన్నిస్, టేబుల్‌టñ న్నిస్, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, కబడ్డీ, క్రికెట్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, బాడీ బిల్డింగ్, వాలిబాల్ తదితరాలు.
ఇన్‌కంటాక్స్ ఇన్‌స్పెక్టర్:
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.08.2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 చెల్లిస్తారు.
టాక్స్ అసిస్టెంట్:
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు గంటకు 8వేల కీ డిప్రెషన్స్ తగ్గకుండా డేటాఎంట్రీ స్పీడ్ ఉండాలి.
వయసు: 01.08.2021 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 చెల్లిస్తారు.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్):
అర్హత: మెట్రిక్యులేషన్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.08.2021 నాటికి 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 చెల్లిస్తారు.
సంబంధిత క్రీడాంశాల్లో జాతీయ లేదా అంతర్జాతీయ ప్రదర్శనలో పాల్గొని ఉండాలి.
ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ నిర్వహించే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్‌లో పాల్గొని ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు గ్రౌండ్/ప్రొఫిషియన్సీ టెస్ట్; టాక్స్ అసిస్టెంట్ అభ్యర్థులకు స్కిల్ టెస్ట్(టైపింగ్) ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.08.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.incometaxmumbai.gov.in
No comments:
Post a Comment