NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Jun 29, 2021

BSF Recruitment 2021: బీఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై ఉద్యోగాలు

  SSK       Jun 29, 2021

BSF Recruitment 2021 | బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF పలు విభాగాల్లో కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

నిరుద్యోగులకు శుభవార్త. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 170 ఖాళీలను ప్రకటించింది. నియామక ప్రక్రియ పూర్తయ్యేనాటికి పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఎయిర్ వింగ్, పారామెడికల్, వెటర్నరీ పోస్టులున్నాయి. ఈ విభాగాల్లో ఎస్సై, ఏఎస్సై పోస్టుల్ని భర్తీ చేస్తోంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF. పారామెడికల్, వెటర్నరీ పోస్టులకు ఒక నోటిఫికేషన్, ఎయిర్ వింగ్ పోస్టులకు మరో నోటిఫికేషన్ విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జూలై 26 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను బీఎస్ఎఫ్ అధికారిక వెబ్‌సైట్ https://bsf.gov.in లేదా రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ https://rectt.bsf.gov.in/ లో తెలుసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్లలో డీటెయిల్డ్ నోటిఫికేషన్స్ ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి.

BSF Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే

మొత్తం ఖాళీలు- 170


పారామెడికల్ సిబ్బంది- 75

ఎస్సై (స్టాఫ్ నర్స్) నాన్ గెజిటెడ్ గ్రూప్ బీ పోస్ట్- 37

ఏఎస్సై (ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్) గ్రూప్ సీ పోస్ట్- 1

ఏఎస్సై (ల్యాబరేటరీ టెక్నీషియన్) గ్రూప్ సీ పోస్ట్- 28

సీటీ (వార్డ్ బాయ్, వార్డ్ గాళ్, ఆయా) గ్రూప్ సీ పోస్ట్- 9


వెటర్నరీ సిబ్బంది- 35

హెచ్‌సీ (వెటర్నరీ) గ్రూప్ సీ పోస్ట్- 20

కానిస్టేబుల్ (కెన్నెల్‌మ్యాన్) గ్రూప్ సీ పోస్ట్- 15


ఎయిర్ వింగ్- 65

అసిస్టెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్ (అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్)- 49

అసిస్టెంట్ రేడియో మెకానిక్ (అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్)- 8

కానిస్టేబుల్ (స్టోర్‌మ్యాన్)- 8

BSF Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తు ప్రారంభం- 2021 జూన్ 27

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 26

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

వయస్సు- పోస్టును బట్టి అభ్యర్థుల గరిష్ట వయస్సు పరిమితి వేర్వేరుగా ఉంది.

ఎంపిక విధానం- మొదటి దశ, రెండో దశ రాతపరీక్ష, డాక్యుమెంటేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్.

దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.


logoblog

Thanks for reading BSF Recruitment 2021: బీఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై ఉద్యోగాలు

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...