భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన టాటా మెమోరియల్ సెంటర్(టీఎంసీ) ఆధ్వర్యంలోని టాటా మెమోరియల్ హాస్పిటల్.. సీనియర్ రెసిడెంట్లు/ఫెలో/మెడికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 64
విభాగాలు: బయో కెమిస్ట్రీ, ఆంకాలజీ, హెమటోపాథాలజీ, మెడికల్ ఆంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, పాథాలజీ, మైక్రోబయాలజీ, రేడియేషన్ ఆంకాలజీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్, ఎండీ/డీఎన్‌బీ/పీజీ, ఎండీఎస్, ఎంఎస్/ఎంసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం–ఆయా కేటగిరీని అనుసరించి 3 నుంచి 10ఏళ్ల వరకూ వయసులో సడలింపు లభిస్తుంది.
వేతనం: మెడికల్ ఆఫీసర్లకు నెలకు రూ.84,000; ఫెలోకు నెలకు రూ.89,000; సీనియర్ రెసిడెంట్లకు నెలకు రూ.1,01,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వూ్య ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://tmc.gov.in
No comments:
Post a Comment