ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 10,143 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సీఎం శుక్రవారం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు. ఇప్పటి నుంచి మార్చి 2022 వరకు భర్తీ చేసే ఉద్యోగాల వివరాలను ఆ జాబ్ క్యాలెండర్ లో ఉంచారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మెరిట్ ఆధారంగానే రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఎలాంటి పైరవీలకు, సిఫార్సులకు తావు ఉండవన్నారు. ఏళ్లుగా ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటూ ఎదురు చూస్తున్న అభ్యర్థులు మనోధైర్యం కోల్పోకుండా ఉద్యోగాలను భర్తీ చేపట్టినట్లు సీఎం వివరించారు. ఏ నెలలో ఏ ఉద్యోగ భర్తీ జరుగుతుందో ముందుగానే తెలిసేలా జాబ్ క్యాలెండర్ తీసుకొస్తున్నమన్నారు. గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో 6,03,756 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు సీఎం చెప్పారు. ఇందులో పర్మినెంట్ ఉద్యోగాలు 1,84,164 ఉన్నాయన్నారు. మిగతా 3,99,791 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కాగా.. మరో 19, 701 కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేశామన్నారు.
అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని జగన్ తెలిపారు. ఒకేసారి లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు. వాలంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టి రాష్ట్రంలోని 2.50లక్షలకు పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు సీఎం. ఆదాయం తగ్గిన ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదన్నారు. ప్రభుత్వం రూ.3,500 కోట్ల భారం పడుతున్నా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 51,387 మందికి ఉద్యోగ భద్రత ఇచ్చామని సీఎం చెప్పారు.
సీఎం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది జూలై నుంచి నెలల వారీగా చేపట్టనున్న నియామకాల వివరాలు ఇలా ఉన్నాయి:
జూలై-2021: బ్యాక్‌లాగ్ వేకెన్సీలు-ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు-1,238
ఆగస్టు-2021: ఏపీపీఎస్సీ గ్రూప్ 1&గ్రూప్ 2-36
సెప్టెంబర్-2021: పోలీస్ శాఖ ఉద్యోగాలు-450
అక్టోబర్-2021: వైద్య శాఖలో డాక్టర్స్&అసిస్టెంట్ ప్రొఫెసర్లు-451
నవంబర్-2021: వైద్య శాఖలో పారామెడికల్, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు-5,251
డిసెంబర్-2021: వైద్య శాఖలో నర్సులు-441
జనవరి-2022: విద్యాశాఖ- లెక్చరర్లు(డిగ్రీ కాలేజీ)-240
ఫిబ్రవరి-2022: విద్యాశాఖ- అసిస్టెంట్ ప్రొఫెసర్లు(యూనివర్సిటీలు)-2,000
మార్చి-2022: ఇతర శాఖలు-36
భర్తీ చేయనున్న మొత్తం ఉద్యోగాలు: 10,143
No comments:
Post a Comment