NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

May 27, 2021

Indian Army SSC Recruitment 2021: ఇండియన్ ఆర్మీలో 191 ఉద్యోగాలు

  SSK       May 27, 2021

Indian Army SSC Recruitment 2021 | ఇండియన్ ఆర్మీ 191 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు కోరుకునే వారికి గుడ్ న్యూస్. పలు ఖాళీల భర్తీకి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 57వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) మెన్, 28వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) వుమెన్ కోర్స్ కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. పెళ్లికాని యువతీయువకులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2021 జూన్ 23 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు, ఇతర అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఎంపికైన వారికి తమిళనాడు రాజధాని చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఉంటుంది.

Indian Army SSC Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే

మొత్తం ఖాళీలు- 191

  • 57వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) మెన్- 175
  • సివిల్- 60
  • ఆర్కిటెక్చర్- 1
  • మెకానికల్- 5
  • ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్- 8
  • ఎలక్ట్రానిక్స్- 2
  • కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ టెక్నాలజీ / ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్- 31
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 12
  • ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్- 5
  • టెలీకమ్యూనికేషన్- 4
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్- 5
  • శాటిలైట్ కమ్యూనికేషన్- 3
  • మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్- 3
  • ఏరోనాటికల్ / ఏరోస్పేస్ / ఏవియానిక్స్ - 6
  • ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఇన్‌స్ట్రుమెంటేషన్- 4
  • ఆటోమొబైల్ ఇంజనీరింగ్- 3
  • ప్రొడక్షన్- 3
  • ఇండస్ట్రియల్ / మ్యాన్యుఫ్యాక్చరింగ్ / ఇండస్ట్రియల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్- 6
  • ఆప్టో ఎలక్ట్రానిక్స్- 3
  • ఫైబర్ ఆప్టిక్స్- 2
  • బయో టెక్నాలజీ- 1
  • బాలిస్టిక్స్ ఇంజనీరింగ్- 1
  • రబ్బర్ టెక్నాలజీ- 1
  • కెమికల్ ఇంజనీరింగ్- 1
  • వర్క్‌‌షాప్ టెక్నాలజీ- 3
  • లేజర్ టెక్నాలజీ- 2


28వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) వుమెన్ కోర్స్- 14

  • సివిల్ / బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ- 5
  • మెకానికల్- 1
  • ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్- 1
  • కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ టెక్నాలజీ / ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్- 4
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 2
  • ఏరోనాటికల్ / ఏరోస్పేస్ / ఏవియానిక్స్ - 1
  • డిఫెన్స్ సిబ్బంది వితంతువులు- 2

Indian Army SSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

  • దరఖాస్తు ప్రారంభం- 2021 మే 25
  • దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూన్ 23
  • విద్యార్హతలు- సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ కావాలి. ఇంజనీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అప్లై చేయొచ్చు. 2021 అక్టోబర్ 1 లోపు ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ కావాలి.
  • వయస్సు- 20 నుంచి 27 ఏళ్లు.

logoblog

Thanks for reading Indian Army SSC Recruitment 2021: ఇండియన్ ఆర్మీలో 191 ఉద్యోగాలు

Previous
« Prev Post

1 comment:

More ...