ఏపీలో నిరుద్యోగులకు అలర్ట్.. భారీగా వాలంటీరు పోస్టులు భర్తీ చేయనున్నారు. అయితే దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరి తేది.. ఆసక్తి ఉన్నవారు ఆలస్యం చేయకుండా వెంటనే ప్రయత్నించండి..
ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అత్యంత చేరువ చేయాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చింది. జీతాలు కాస్త తక్కవగానే ఉన్నా.. భారీగా ప్రోత్సహాకాలు ఇస్తోంది ఏపీ ప్రభుత్వం.
మొన్న ఉగాది నాడు ఉత్తమ వాలంటీర్లను గుర్తించి సీఎం జగన్ పురష్కారాలు అందించారు. ప్రతి ఏడాది ఆ సంప్రదాయన్ని కొనసాగిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
ఈ వాలంటీవ్ వ్యవస్థ ద్వారా ప్రజలకు అనేక సేవలు చాలా సులభంగా అందుతున్నాయి. క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ కార్యక్రమాలు చేరుతున్నాయి.
ఏపీ వ్యాప్తంగా మొత్తం 2268 మంది గ్రామ/వార్డ్ సచివాలయ వలంటీర్‌లను ప్రభుత్వం ఎంపిక చేయనుంది.
జిల్లాల వారిగా చూస్తే శ్రీకాకుళం–397, నెల్లూరు–1006, చిత్తూరు–569, ప్రకాశం–296.
వాలంటీరుకు కావాల్సిన అర్హతలు ఇవే.. పదో తరగతి లేదా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత సాధించాలి. స్థానిక గ్రామ లేదా వార్డ్ పరిధిలో నివశిస్తూ ఉండాలి. వయసు మాత్రం 18–35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీకి ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంది. ఇప్పటికే వేల సంఖ్యలో గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టుల్ని భర్తీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కానీ వాలంటీర్లు గైర్హాజరు కావడం, సరిగ్గా విధులు నిర్వహించకపోవడం, ఇంకొందరు ఉద్యోగానికి రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఉద్యోగాలు మీ కోసమే ఎదరు చూస్తున్నాయి.
అప్లై చేసుకోవాడనికి రేపే ఆఖరి తేదీ.. ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి.. మీకు వాలంటీర్ జాబ్ చేయాలని కోరిక ఉంటే వెంటనే అప్లై చేసుకోండి.. ధరఖాస్తు ఎలా చేయాలి అనుకుంటున్నారా? ఈ వెబ్‌సైట్ ద్వారా: https://gswsvolunteer.apcfss.in లాగిన్ అయితే అన్ని విషయాలు క్లియర్ గా ఉంటాయి.ఈ గోల్డెన్ ఛాన్స్ ను మరి మిస్ చేసుకోకండి.
No comments:
Post a Comment