Volunteer Jobs in AP: ఆంధ్రప్రదేశ్ లో మరో సారి భారీగా వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించారు.
ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అత్యంత చేరువ చేయాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చింది.
ఈ వాలంటీవ్ వ్యవస్థ ద్వారా ప్రజలకు అనేక సేవలు చాలా సులభంగా అందుతున్నాయి. క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ కార్యక్రమాలు చేరుతున్నాయి.
దీంతో పాటు లక్షలాది మంది నిరుద్యోగులకు ఈ వాలంటీర్ వ్వవస్థ ద్వారా ఉపాధి సైతం లభిస్తోంది. వివిధ జిల్లాల్లో ఏర్పడుతున్న వాలంటీర్ పోస్టుల ఖాళీలను అధికారులు ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 2268 వాలంటీర్ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇందులో అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 1006, చిత్తూరులో 569, ప్రకాశం జిల్లాలో 296, శ్రీకాకుళం జిల్లాలో 397 ఖాళీలు ఉన్నాయి.
టెన్త్ లేదా ఇంటర్ పాసై, ఆయా గ్రామ, వార్డు పరిధిలో నివసిస్తూ ఉండే అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-35 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, నాయకత్వ లక్షణాలు, ఇతర స్కిల్స్ కు 25 చొప్పున మార్కులు కేటాయించనున్నారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. జిల్లాల వారీగా ఆఖరి తేదీలు(మే 20 - 25) వేర్వేరుగా ఉన్నాయి. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
నోటిఫికేషన్ లింక్: https://apgv.apcfss.in/notificationPublicReport.do
అధికారిక వెబ్ సైట్: https://gswsvolunteer.apcfss.in/
No comments:
Post a Comment