NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Apr 20, 2021

IGCAR Recruitment 2021 @337 Vacancies

  SSK       Apr 20, 2021

కల్పకం(తమిళనాడు)లోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రీసెర్చ్‌(ఐజీసీఏఆర్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 337 (డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌–98, స్టైపెండరీ ట్రెయినీ–239)

డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌:

పోస్టులు: సైంటిఫిక్‌ ఆఫీసర్, టెక్నికల్‌ ఆఫీసర్, టెక్నీషియన్, స్టెనోగ్రాఫర్, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్, సెక్యూరిటీ గార్డ్, వర్క్‌ అసిస్టెంట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాతపరీక్ష/ఇంటర్వూ, స్కిల్‌ టెస్ట్‌ (స్టెనోగ్రఫీ, ఫిజికల్‌ టెస్ట్, డ్రైవింగ్‌), అడ్వాన్స్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.


స్టైపెండరీ ట్రెయినీ:

స్టైపెండరీ ట్రెయినీ– కేటగిరీ–1: 68 (కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌)

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.


స్టైపెండరీ ట్రెయినీ– కేటగిరీ–2: 171

ట్రేడులు: డ్రాఫ్ట్స్‌మెన్‌(మెకానికల్‌), ఫిట్టర్‌/రిగ్గర్, ప్లంబర్, వెల్డర్, ల్యాబ్‌ అసిస్టెంట్‌ తదితరాలు.

అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ (ఎంపీసీ) ఉత్తీర్ణతతో పాటు సంబం«ధిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తిచేయాలి.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్‌ టెస్ట్, ట్రేడ్‌/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.igcar.gov.in

logoblog

Thanks for reading IGCAR Recruitment 2021 @337 Vacancies

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...