TCS National Qualifier Test 2021 | టీసీఎస్ అయాన్ మే 1, మే 13 తేదీల్లో నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ నిర్వహించబోతోంది. ఈ పరీక్ష క్వాలిఫై అయితే లాభమేంటో తెలుసుకోండి.
కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం మీ కలా? అయితే అద్భుతమైన అవకాశం వచ్చింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కి చెందిన టీసీఎస్ అయాన్ మరోసారి నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్- TCS NQT 2021 నిర్వహిస్తోంది. గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు లేదా ఇటీవల డిగ్రీ పూర్తి చేసినవారు లేదా రెండేళ్ల క్రితం డిగ్రీ పాస్ అయినవారు ఈ ఎగ్జామ్ రాయొచ్చు. కేవలం ఫ్రెషర్స్ కోసం నిర్వహిస్తున్న ఎగ్జామ్ ఇది. ఇందులో క్వాలిఫై అయినవారు ఈ పరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. ప్రస్తుతం TCS NQT 2021 దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 20 చివరి తేదీ. మే 1, మే 13 తేదీల్లో టీసీఎస్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ ఉంటుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి చివరి తేదీ వరకు ఎదురుచూడకుండా ముందే దరఖాస్తు చేసినవారికి పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాలను https://learning.tcsionhub.in/hub/national-qualifier-test/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
Realme Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ డేస్ సేల్ ప్రారంభం
TCS National Qualifier Test 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 20
నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్- మే 1, మే 13
విద్యార్హతలు- డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్నవారు లేదా పాస్ అయినవారు.
వయస్సు- 18 నుంచి 28 ఏళ్లు
Amazon Smartphone Upgrade Days sale
TCS National Qualifier Test 2021: నాలుగు అంశాల్లో నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్
Cognitive Skills NQT: అభ్యర్థుల వర్బల్ ఎబిలిటీ అంటే ఇంగ్లీష్ గ్రామర్, రీజనింగ్ ఎబిలిటీ అంటే పదాలు గుర్తించడం, న్యూమరిక్ ప్యాటర్న్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫిగరల్ అండ్ ఫ్యాక్చువల్ అనాలిసిస్, డిసిషన్ మేకింగ్, ప్రపోషనల్ రీజనింగ్, విజువల్ స్పేటియల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ లాంటి అంశాల్లో ఎగ్జామ్ ఉంటుంది.
Attitudinal Alignment NQT: కాగ్నిటీవి స్కిల్స్ టెస్ట్ క్వాలిఫై అయినవారు ఈ ఎగ్జామ్ రాయొచ్చు. ఎంట్రీలెవెల్ పొజిషన్స్ కోసం నిర్వహించే పరీక్ష ఇది.
Industry NQT: అభ్యర్థులకు ప్రత్యేకంగా ఓ ఇండస్ట్రీపై ఉన్న పట్టును తెలుసుకోవడానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు.
Subject NQT: సూడోకోడ్, ఆల్గరిథమ్స్, ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్స్, బేసిక్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్, సీ, సీ++, జావా లాంటి సబ్జెక్ట్స్‌లో నైపుణ్యం ఉన్నవారు ఈ ఎగ్జామ్ రాయొచ్చు.
టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-IT కంపెనీలతో పాటు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్-BFSI, మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల్లో జాబ్స్ కావాలనుకునే ఫ్రెషర్స్ టీసీఎస్ అయాన్ నిర్వహించే నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ రాయొచ్చు.
No comments:
Post a Comment