తమ పిల్లలకు కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు కోరుకునే తల్లిదండ్రులకు శుభవార్త. 2021-22 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల షెడ్యూల్‌ను ప్రకటించింది కేంద్రీయ విద్యాలయ సంఘటన్. 1వ తరగతిలో అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2021 ఏప్రిల్ 1న ప్రారంభం కానుంది. ఏప్రిల్ 19 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇక 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు 2021 ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 15 వరకు జరగనున్నాయి. ఈ అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అధికారిక వెబ్‌సైట్ https://kvsangathan.nic.in/ లో తెలుసుకోవచ్చు. అధికారిక సమాచారం కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఈ వెబ్‌సైట్ మాత్రమే ఫాలో కావాలి. అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. https://kvsonlineadmission.kvs.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. లేదా ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లో కూడా దరఖాస్తు చేయొచ్చు. విద్యార్థుల తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం కేంద్రీయ విద్యాలయ స్కూళ్లకు రావొద్దని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ సూచించింది.
Amazon Smartphone Upgrade Days sale
Realme Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ డేస్ సేల్ ప్రారంభం
Kendriya Vidyalaya Admissions 2021: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల షెడ్యూల్ ఇదే
1వ తరగతిలో అడ్మిషన్లకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం- 2021 ఏప్రిల్ 1 ఉదయం 10 గంటల నుంచి
1వ తరగతిలో అడ్మిషన్ల దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 19 రాత్రి 7 గంటల వరకు
మొదటి జాబితా విడుదల- 2021 ఏప్రిల్ 23
రెండో జాబితా విడుదల- 2021 ఏప్రిల్ 30
మూడో జాబితా విడుదల- 2021 మే 5
ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం రెండో నోటిఫికేషన్ విడుదల- 2021 మే 10
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మే 13
రెండో తరగతి నుంచి ఇతర తరగతులకు (11వ తరగతి మినహాయించి) దరఖాస్తులు- 2021 ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 15 వరకు
ఎంపికైన వారి జాబితా విడుదల- 2021 ఏప్రిల్ 19 సాయంత్రం 4 గంటలకు
రెండో తరగతి నుంచి ఇతర తరగతులకు (11వ తరగతి మినహాయించి) అడ్మిషన్లు- 2021 ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 27 వరకు
అడ్మిషన్లకు చివరి తేదీ- 2021 మే 31
11వ తరగతిలో అడ్మిషన్లకు రిజిస్ట్రేషన్- కేంద్రీయ విద్యాలయ 10వ తరగతి ఫలితాలు విడుదలైన 10 రోజుల్లో
అడ్మిషన్ లిస్ట్ విడుదల- కేంద్రీయ విద్యాలయ 10వ తరగతి ఫలితాలు విడుదలైన 20 రోజుల్లో
కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు కానివారికి 11వ తరగతిలో అడ్మిషన్లు- కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు 11వ తరగతిలో చేరిన తర్వాత
11వ తరగతిలో అడ్మిషన్లకు చివరి తేదీ- సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదలైన 30 రోజులకు.
నియమనిబంధనల ప్రకారం ఫ్రెష్ అడ్మిషన్ కోసం 25 శాతం సీట్లను రైట్ టు ఎడ్యుకేషన్ కోసం, ఎస్సీ విద్యార్థులకు 15 శాతం, ఎస్టీ విద్యార్థులకు 7.5 శాతం, ఓబీసీ నాన్ క్రీమీలేయర్ విద్యార్థులకు 27 శాతం సీట్లు కేటాయిస్తారు.
Realme Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ డేస్ సేల్ ప్రారంభం
No comments:
Post a Comment