వేతన జీవులకు రిలీఫ్: పీఎఫ్ వడ్డీపై పన్ను లిమిట్ పెంపు!
వివిధ సంస్థలు, ఫ్యాక్టరీల్లో పని చేస్తున్న ఉద్యోగుల వార్షిక ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్) వడ్డీపై పన్ను లిమిట్‌ను పెంచారు. ఈ మేరకు ఉద్యోగుల పీఎఫ్ రూ.5 లక్షలు కంటే ఎక్కువ జమ అయిన మొత్తాలపై వడ్డీ మీద మాత్రమే పన్ను విధించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2021 ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చకు లోక్‌సభలో మంగళవారం ఆమె సమాధానం ఇచ్చారు.
👉బడ్జెట్ ప్రతిపాదనల్లో నిర్మలమ్మ ఇలా
▪️గత నెల ఒకటో తేదీన వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తూ నిర్మలా సీతారామన్.. ఉద్యోగుల పీఎఫ్ రూ.2.5 లక్షలు, అంతకంటే ఎక్కువగా ఉంటే, దానిపై వచ్చే వడ్డీ మీద పన్ను వడ్డించనున్నట్లు ప్రతిపాదించారు. ఇది 2021 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. అలాగే పీఎఫ్ కంట్రిబ్యూషన్ పై కేవలం ఒక్కశాతం పన్ను మాత్రమే వసూలు చేస్తామని చెప్పారు.
👉ఇలా పీఎఫ్ ఖాతాల్లో నగదు జమ
▪️అయితే, దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసేవారు ప్రతి నెలా తాము సంపాదించిన మొత్తంలో కొంత సొమ్మును భవిష్యత్ అవసరాల కోసం ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంటారు. పదవీ విరమణ అనంతరం ఆ సొమ్మును తమ అవసరాలకో, పిల్లల పెండ్లిండ్లకో, చదువులకో వినియోగిస్తుంటారు.
👉వతనాన్ని బట్టి పీఎఫ్ ఖరారు
▪️ఈ పీఎఫ్ సొమ్ము అనేది వ్యక్తి పొందే వేతనం, సర్వీసును బట్టి ఒక్కక్కరికి ఒక్కోలా ఉంటుంది. అందువల్ల రిటైర్మెంట్ తర్వాత కొందరికి రెండు మూడు లక్షలు వస్తే, మరికొందరికి రూ.20, రూ.30 లక్షల వరకు వస్తాయి. కానీ, మన దేశంలోని ఒక వ్యక్తి పీఎఫ్ ఖాతాలో మాత్రం ఏకంగా రూ.103 కోట్లు జమ అయ్యాయి.
👉ఇద్దరి ఖాతాల్లో రూ.86 కోట్ల చొప్పున జమ
▪️రండో స్థానంలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తుల పీఎఫ్ ఖాతాల్లో కూడా ఒక్కొక్కరి ఖాతాలో రూ.86 కోట్ల చొప్పున జమ అయ్యాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం కేవలం ముగ్గరు వ్యక్తులకే పీఎఫ్‌పై వడ్డీ రూపంలో కొన్ని కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుందని గమనించింది.
👉టప్-100 జమ రూ.2000 కోట్లు
▪️అత్యధికంగా పీఎఫ్ సొమ్ము జమచేసిన టాప్-20 మంది సొమ్ము రూ.825 కోట్లు, టాప్-100 మంది సొమ్ము రూ.2000 కోట్లు ఉందని కూడా ప్రభుత్వం లెక్కలు చూసింది. అయితే, తమ పీఎఫ్ ఖాతాల్లో అత్యధిక సొమ్ము జమచేసిన వారి పేర్లను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు.
👉భరీ స్వచ్ఛంద సొమ్ము జమకు పన్ను మినహాయింపా?
అందుకే అంత పెద్ద మొత్తంలో డబ్బును పొదుపు చేస్తున్న వారికి కూడా వడ్డీపై పన్ను మినహాయింపు ఇవ్వడం కరెక్టు కాదని కేంద్రం భావించింది. బ్యాంకుల్లో, పోస్టాఫీస్ ఖాతాల్లో అధిక మొత్తం జమచేసే వారి నుంచి వడ్డీపై పన్ను వసూలు చేస్తూ, పీఎఫ్ ఖాతాలో భారీ నగదు జమచేసే వారికి మాత్రం పన్ను మినహాయింపునివ్వడం సమంజసం కాదని నిర్ణయించింది.
స్వచ్ఛంద డిపాజిటర్ల కోసం ప్రత్యేక నిధి
పీఎఫ్‌లో స్వచ్ఛందంగా నగదు డిపాజిట్ చేసేవారి కోసం ప్రత్యేకించి ఒక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు కూడా కేంద్రం ప్రకటించింది. ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో స్వచ్ఛందంగా చేరే కొత్త సబ్‌స్క్రైబర్ల కోసం ఈపీఎఫ్‌వో ఆధ్వర్యంలోనే ప్రత్యేక నిధిని కేంద్రం ఏర్పాటు చేయనున్నది.
పీఎఫ్ వడ్డీరేట్లలో తేడాలు
అందుకే వివిధ సంస్థల్లో పనిచేస్తూ ఈపీఎఫ్‌వోలో సభ్యులుగా చేరిన వారికి, స్వచ్ఛంద సభ్యులు జమ చేసిన మొత్తం నిధికి ఒకే వడ్డీరేటు వర్తించబోదు. స్వచ్ఛంద సభ్యుల కోసం ఈపీఎఫ్‌వో ప్రత్యేక నిధిని త్వరలో ప్రారంభించే తేదీని ప్రకటిస్తామని కేంద్ర అధికార వర్గాలు తెలిపాయి.
No comments:
Post a Comment