జూన్ 21 నుంచి ఓపెన్ స్కూల్స్ పరీక్షలు టెన్త్, ఇంటర్ విద్యార్థులకు
ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్ సొసైటీ(ఏపీఓఎ్‌సఎస్) నిర్వహించే టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మంగళవారం విడుదల చేశారు. జూన్ 21 నుంచి 28 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ జనరల్, వృత్తి విద్యా కోర్సులకు ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 29 నుంచి జూలై 4 వరకు (ఆదివారంతో సహా) జరుగుతాయి. టెన్త్ విద్యార్థులకు జూన్ 21న తెలుగు, ఊర్దూ, కన్నడ, ఒరియా, తమిళం, 22న ఇంగ్లీషు, 23న గణితం, భారతీయ సంస్కృతి-వారసత్వం, 24న శాస్త్ర-సాంకేతిక విజ్ఞానం, గృహవిజ్ఞాన శాస్త్రం, 25న సాంఘిక శాస్త్రం, ఆర్థికశాస్త్రం, 26న హిందీ, 28న బిజినెస్ స్టడీస్, మనో విజ్ఞాన శాస్త్రం సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి. అలాగే, ఇంటర్ విద్యార్థులకు జూన్ 21న హిందీ, తెలుగు, ఉర్దూ, 22న ఇంగ్లీషు, 23న గణితం, చరిత్ర, వ్యాపార గణక శాస్త్రం, 24న భౌతికశాస్త్రం, రాజనీతి/పౌర శాస్త్రం, మనో విజ్ఞానశాస్త్రం, 25న రసాయన శాస్త్రం, ఆర్థికశాస్త్రం, సామాజిక శాస్త్రం, 26న జీవశాస్త్రం, వాణిజ్య/వ్యాపార శాస్త్రం, గృహ విజ్ఞాన శాస్త్రం, 28న అన్ని వృత్తి విద్యా సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తారు.
No comments:
Post a Comment