PMKVY: నిరుద్యోగులకు కేంద్రం కొత్త స్కీమ్.. ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం.. మధ్యలోనే చదువు మానేసిన వారికి వరం
pmkvyofficial.org: ఇందులో 300కు పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నచ్చిన కోర్సును సెలెక్ట్ చేసుకుని యువకులు శిక్షణ పొందొచ్చు.
- పీఎంకేవీవై 3.0 ప్రారంభం.. 8 లక్షల మందికి ట్రైనింగ్
- ఉచిత శిక్షణతో పాటు ఉపాధి
- 300కు పైగా కోర్సులు
- నచ్చిన కోర్సును సెలెక్ట్ చేసుకునే ఛాన్స్
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ ఊరట కలిగిస్తూ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన స్కీమ్ మూడో విడత ప్రారంభించింది. దీనితో సులువుగా ఉపాధి లభించనుంది. నైపుణ్యాలు నేర్పిస్తూ ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 లో భాగంగా యువతకు ఉపాధి కల్పిస్తారు. దీనిలో ఏకంగా 300కు పైగా కోర్సులు అందుబాటు లో ఉన్నాయి. నచ్చిన కోర్సును సెలెక్ట్ చేసుకుని యువకులు శిక్షణ పొందొచ్చు.
పీఎంకేవీవై 3.0 స్కీమ్ కింద 2020-21లో 8 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని మోదీ సర్కా్ర్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. పీఎంకేవీవై 3.0 స్కీమ్ కింద రూ.948 కోట్లు ఖర్చు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం జిల్లాల్లో స్కిల్స్ కమిటీలను ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా యువతకు వొకేషనల్ ట్రైనింగ్ అందిస్తారు. దీని వల్ల యువత వారికి నచ్చిన రంగంలో ఉపాధి పొందొచ్చు.
ఆసక్తిగల యువతీయువకులు https://pmkvyofficial.org/ వెబ్‌సైట్‌కు వెళ్లి మీ పేరు రిజిస్టర్ చేసుకుని ట్రైనింగ్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరికీ ట్రైనింగ్ సర్టిఫికెట్ అందజేస్తారు.
మధ్యలోనే చదువు మానేసిన వారు, నిరుద్యోగులు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ (PMKVY) స్కీమ్ అందిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా డ్రాపౌట్స్, నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తారు. దీని కోసం మీరు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు.
Also Read: SBI Recuritment 2021
No comments:
Post a Comment