NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Jan 23, 2021

NEET 2021: నీట్‌ అభ్యర్థులకు లక్కీ‌ ఛాన్స్‌..

  SSK       Jan 23, 2021

 NEET 2021: నీట్‌ అభ్యర్థులకు లక్కీ‌ ఛాన్స్‌.. ఈసారి కొశ్చన్‌ పేపర్‌లో ఛాయిస్‌.. కేంద్ర విద్యాశాఖ నిర్ణయం

NEET, JEE 2021 Syllabus: జేఈఈ మెయిన్‌ మాదిరిగానే ఈ ఏడాది నీట్‌ కొశ్చన్‌ పేపర్‌లోనూ ఛాయిస్‌ ఇవ్వనున్నారు.

NEET_2021_UPDATE
కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్‌ మాదిరిగానే ఈ ఏడాది నీట్‌ కొశ్చన్‌ పేపర్‌లోనూ ఛాయిస్‌ ఇవ్వనున్నారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. కరోనా కారణంగా ఏర్పడిన గందరగోళ పరిస్థితుల వల్ల విద్యార్థులపై ఒత్తిడి పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే జేఈఈ తరహాలోనే నీట్‌ పరీక్షకు కూడా పాత సిలబసే ఉంటుందని స్పష్టం చేసింది.

జేఈఈ మెయిన్‌ 90 ప్రశ్నల్లో 75 ప్రశ్నలకు మాత్రమే జవాబులు గుర్తించాలని జాతీయ పరీక్ష మండలి (ఎన్‌టీఏ) కొద్దిరోజుల క్రితం నిర్ణయించిన విషయం తెలిసిందే. నీట్‌లో ప్రస్తుతం ఒక్కొ ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 180 ప్రశ్నలతో 720 మార్కులకు ప్రశ్నపత్రం ఇస్తున్నారు. అంటే ఒక్కో సబ్జెక్టు నుంచి 45 ప్రశ్నలు ఉంటున్నాయి. దీన్ని 50కి పెంచే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఛాయిస్‌ ఇచ్చినా అందకు తగ్గట్లు కొన్ని నిబంధనలు పెట్టే అవకాశముంది.

ప్రతీ ఏడాది దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్షకు దాదాపు 15 లక్షల మంది పోటీ పడుతుండగా.. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.20 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. నీట్‌ 2021 పరీక్ష తేదీని ఇంకా వెల్లడించలేదు. ఈ తేదీని త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.


logoblog

Thanks for reading NEET 2021: నీట్‌ అభ్యర్థులకు లక్కీ‌ ఛాన్స్‌..

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...