యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్-CDS రెండో నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతీ ఏటా ఈ నోటిఫికేషన్‌ను రెండుసార్లు రిలీజ్ చేస్తుంది యూపీఎస్‌సీ. ఇప్పుడు రెండో నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తుల్నిస్వీకరిస్తోంది. ఈసారి 339 ఖాళీలను ప్రకటించింది. డిఫెన్స్‌లోని ఎయిర్‌ఫోర్స్, నేవీ, మిలిటరీ ఫోర్స్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కూడా పలు పోస్టులున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు https://upsc.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేయడానికి 2021 ఆగస్ట్ 24 చివరి తేదీ. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
UPSC CDS II 2021: ఖాళీల వివరాలు ఇవే
మొత్తం ఖాళీలు- 339
- ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రడూన్- 100
- ఇండియన్ నావల్ అకాడమీ, ఎజిమల- 22
- ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్- 32
- ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (పురుషులు)- 169
- ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మహిళలు)- 16
UPSC CDS II 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
- నోటిఫికేషన్ విడుదల- 2021 ఆగస్ట్ 4
- దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 4
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 24 సాయంత్రం 6 గంటలు
- దరఖాస్తుల విత్‌డ్రా- 2021 ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 6 సాయంత్రం 6 గంటలు
- అడ్మిట్ కార్డుల విడుదల- ఎగ్జామ్‌కు మూడు వారాల ముందు
UPSC CDS II 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- విద్యార్హత- ఐఎంఏ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ-చెన్నై కోసం డిగ్రీ పాస్ కావాలి. ఇండియన్ నావల్ అకాడమీ కోసం ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీ కోసం 10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్‌తో పాటు డిగ్రీ పాస్ కావాలి. లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
- దరఖాస్తు ఫీజు- రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
- పరీక్షా కేంద్రాలు- హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ
- వయస్సు- 20 నుంచి 24 ఏళ్లు. 1998 జూలై 2 నుంచి 2003 జూలై 1 మధ్య జన్మించిన వారు అప్లై చేయాలి.
UPSC CDS II 2021: అప్లై చేయండి ఇలా
- అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో ONLINE APPLICATION FOR VARIOUS EXAMINATIONS OF UPSC లింక్ క్లిక్ చేయాలి.
- తర్వాతి పేజీలో Combined Defence Services Examination (II) నోటిఫికేషన్ ఉంటుంది.
- Part-I Registration రిజిస్ట్రేషన్ లింక్ పైన క్లిక్ చేయాలి.
- అభ్యర్థి వివరాలతో పార్ట్ 1 రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
- ఆ తర్వాత పార్ట్ 2 రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
- ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించాలి.
- దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.
The first manufacturing models went on trial on the Las Vegas Hilton Hotel. Fortune Coin Co. and its video slot-machine know-how have been bought by IGT in 1978. A slot machine , fruit machine or poker machine is a playing machine that creates a recreation of probability for its customers. The majority of them are traditional, casino-themed style slots with selection of|quite 온라인 카지노 a lot of|a wide range of} machines and methods to play. You can also find games themed for cartoons, various characters, and different personalities. Most of the games don’t require an Internet connection to play.
ReplyDelete