ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: ఎగ్జిక్యూటివ్
పోస్టుల సంఖ్య: 920
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. పరీక్ష మొత్తం 150 ప్రశ్నలు–150 మార్కులకు మూడు విభాగాల్లో నిర్వహిస్తారు. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 50 ప్రశ్నలు–50 మార్కులు, టెస్ట్ ఆఫ్ వర్కింగ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు–50 మార్కులు, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు.
ముఖ్య సమాచారం:
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 18.08.2021
- పరీక్ష తేది: 05.09.2021
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.idbibank.in/
Inter
ReplyDelete