SBI Apprentice Recruitment 2021 | ఎస్‌బీఐ 6100 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీల వివరాలు తెలుసుకోండి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI మరో భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం 6100 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఖాళీలు ఉన్నాయి. అప్రెంటీస్ యాక్ట్ 1961 ప్రకారం ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఎస్‌బీఐ. ఏ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఆ రాష్ట్రంలో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. బ్యాంకులో ఉద్యోగం కాదు. ఆసక్తి గల అభ్యర్థులు ఎస్‌బీఐ వెబ్‌సైట్స్‌తో పాటు ఇతర వెబ్‌సైట్లలో దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2021 జూలై 26 చివరి తేదీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు తెలుగు లేదా ఉర్దూ తెలిసి ఉండాలి.
SBI Apprentice Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే
మొత్తం ఖాళీలు- 6100
తెలంగాణ- 125
ఆదిలాబాద్ -3
భద్రాద్రి కొత్తగూడెం -6
జగిత్యాల్ -2
జనగాం -3
జయశంకర్ భూపాలపల్లి-3
జోగులంబ గద్వాల -2
కామారెడ్డి -4
కరీంనగర్ -4
ఖమ్మం -7
కొమరంభీమ్ -2
మహాబూబాబాద్ -3
మహబూబ్‌నగర్ -9
మల్కాజ్‌గిరి -2
మంచిర్యాల్ -2
మెదక్ -4
నాగర్‌కర్నూల్ -4
నల్గొండ -6
నిర్మల్ -3
నిజామాబాద్ -11
పెద్దపల్లి -3
రంగారెడ్డి -6
సంగారెడ్డి -5
సిద్దిపేట -5
సిరిసిల్లా -2
సూర్యాపేట -7
వికారాబాద్ -6
వనపర్తి -3
వరంగల్ -1
వరంగల్ రూరల్ -3
యాదాద్రి భువనగిరి-4
ఆంధ్రప్రదేశ్- 100
శ్రీకాకుళం -8
విజయనగరం -8
విశాఖపట్నం -7
తూర్పు గోదావరి -8
పశ్చిమ గోదావరి -8
కృష్ణా -7
గుంటూరు -7
ప్రకాశం -8
నెల్లూరు -8
చిత్తూరు -8
వైఎస్ఆర్ కడప -8
అనంతపూర్ -8
కర్నూలు -7
SBI Apprentice Recruitment 2021: దరఖాస్తు చేయాల్సిన వెబ్‌సైట్స్
https://bank.sbi/careers
https://www.sbi.co.in/ careers
https://nsdcindia.org/apprenticeship
https://apprenticeshipindia.org
http://bfsissc.com
SBI Apprentice Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
దరఖాస్తు ప్రారంభం- 2021 జూలై 6
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 26
ఆన్‌లైన్ ఎగ్జామినేషన్- 2021 ఆగస్ట్
SBI Apprentice Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి.
వయస్సు- 2020 ఆగస్ట్ 31 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం- ఆన్‌లైన్ రాతపరీక్ష, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీతో పాటు స్థానిక భాషల్లో ఉంటాయి. ప్రతీ తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
శిక్షణా కాలం- ఒక ఏడాది
స్టైపెండ్- నెలకు రూ.15,000. ఇతర బెనిఫిట్స్, అలవెన్సులు ఉండవు.
పరీక్షా కేంద్రాలు- తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్. ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
No comments:
Post a Comment