నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఉద్యోగాల భర్తీకి అధికారులు మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) ఒకటన్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్ఐటీలో ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ఐటీ సిల్చార్(NIT - Silchar)లో నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో తెలిపారు. అనంతరం అప్లికేషన్ ఫామ్ స్కానింగ్ కాపీని nfapt_21@nits.ac.inకు మెయిల్ చేయాలని నోటిఫికేషన్లో వెల్లడించారు. సబ్జెక్ట్ లో పోస్టు, అప్లికెంట్ పేరు రాయాలని సూచించారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి జూలై 2ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
మొత్తం 55 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు అధికారులు. ఇందులో రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, లైబ్రేరియన్, మెడికల్ ఆఫీసర్, హిందీ ఆఫీసర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ విభాగంలో ఒక్కో ఖాళీ చొప్పున ఉన్నాయి. సూపరింటెండెంట్ విభాగంలో మరో 7 ఖాళీలు ఉన్నాయి. Technical Assistant / SAS Assistant / Junior Engineer విభాగాల్లో 37 ఖాళీలు ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ విభాగంలో 4 ఖాళీలు ఉన్నాయి.
Official Website - Direct Link
- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడాలని సూచించారు. అప్లై చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ తో పాటు సంబంధిత ధ్రువ పత్రాలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment