NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

May 15, 2021

NMDC Recruitment 2021

  SSK       May 15, 2021

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీకి సంస్థ నుంచి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 తాజాగా నేషనల్ మైనింగ్ డవలప్మెంట్ కార్పొరేషన్ పలు అప్రంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలకు అప్లై చేసుకునేందుకు ఈ నెల 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. డిగ్రీ, డిప్లొమో, ఐటీఐలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయనున్నారు. ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఖాళీల వివరాలు:

మొత్తం 59 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

  • గ్రాడ్యుయేట్ అప్రంటీస్-16 పోస్టులు
  • టెక్నీషియన్ అప్రంటీస్-13 పోస్టులు
  • ప్రోగ్రామింగ్ అండ్ సిస్టెమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్(PASAA)- ఈ విభాగంలో 30 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.


అర్హతల వివరాలు:

గ్రాడ్యుయేట్ అప్రంటీస్: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మైనింగ్ ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో నాలుగేళ్ల డిగ్రీ చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేసేందుకు అర్హులు.

టెక్నీషియన్ అప్రంటీస్: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్, మైనింగ్, మోడ్రన్ ఆఫీస్ ప్రాక్టీస్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ కోర్సుల్లో మూడేళ్ల డిప్లొమో చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

Programming and Systems Administration Assistant (PASAA)- కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(COPA) నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు.


వేతనాలు వివరాలు:

-గ్రాడ్యుయేట్ అప్రంటీస్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 20 వేల పాటు వేతనం చెల్లించనున్నారు.

-టెక్నీషియన్ అప్రంటీస్ ఖాళీలకుఎంపికైన వారికి నెలకు రూ. 16 వేల వేతనం చెల్లించనున్నారు.

-ఇతర ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల వరకు చెల్లించనున్నారు.

Official Website - Direct Link

Notification - Direct Link


ఎలా అప్లై చేయాలంటే:

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్లో సూచించిన ఫార్మాట్లో ఈ నెల 15 లోగా అప్లికేషన్, కావాల్సిన డాక్యుమెంట్లను ఈ మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఈ మెయిల్: bld5hrd@nmdc.co.in.

logoblog

Thanks for reading NMDC Recruitment 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...