ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్).. పర్మనెంట్, షార్ట్‌సర్వీస్ కమిషన్ ద్వారా ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే..ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(ఏఎఫ్‌క్యాట్) నోటిఫికేషన్ విడుదలైంది. ఏటా మే/జూన్, డిసెంబర్‌ల్లో ఈ ప్రకటన వెలువడుతుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 334
ఏఎఫ్‌క్యాట్ ఎంట్రీ:
బ్రాంచ్‌లు–ఖాళీలు: ఫ్లయింగ్–96; గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్)–137; గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్)–73.
మెటియోరాలజీ ఎంట్రీ:
బ్రాంచ్: మెటియోరాలజీ బ్రాంచ్–28
ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ:
బ్రాంచ్: ఫ్లయింగ్ బ్రాంచ్(ఎయిర్ వింగ్ సి సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి).
అర్హతలు
ఫ్లయింగ్ బ్రాంచ్: ఇంటర్ స్థాయిలో మ్యాథమెటిక్స్‌తోపాటు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. ఫైనల్ ఇయర్ విద్యార్థులూ దరఖాస్తుకు అర్హులే.
ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ: 10+2 స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌లో కనీసం 50 శాతం మార్కులతోపాటు గ్రాడ్యుయేషన్ కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. లేదా బీఈ/బీటెక్ కనీసం 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఫైనల్ ఇయర్ విద్యార్థులూ అర్హులే.
గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్: సంబంధిత పోస్టును బట్టి సదరు ఇంజనీరింగ్ బ్రాంచ్(ఎలక్ట్రికల్/మెకానికల్)లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్: పోస్టును బట్టి ఏదైనా డిగ్రీ/బీకామ్/పీజీ తదితర అర్హతలు ఉండాలి.
వయసు: ఫ్లయింగ్ బ్రాంచ్‌కు 01 జూలై 2022 నాటికి 20–24 ఏళ్ల మధ్య ఉండాలి. మిగతావాటికి 20–26 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష, ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్(ఈకేటీ), పైలెట్ అప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్(పీఏబీటీ), మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.06.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:30.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://afcat.cdac.in/AFCAT
No comments:
Post a Comment