ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి అధికారులు వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలు అత్యంత చేరువ చేయాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రయోజనం కలగడంతో పాటు, అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి సైతం లభిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
తాజాగా ప్రకాశం జిల్లాలో వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 291 వాలంటీర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
టెన్త్ పాసై స్థానిక గ్రామ, వార్డు పరిధిలో నివాసం ఉంటున్న వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు. చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై అవగాహన ఉండాలి.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 18లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
పూర్తి వివరాలకు, అప్లై చేయడానికి అభ్యర్థులు https://gswsvolunteer.apcfss.in/ వెబ్ సైట్ ను సందర్శించాలని అధికారులు సూచించారు.
No comments:
Post a Comment