NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Apr 5, 2021

NTA DU Recruitment 2021@1145 Vacancies

  SSK       Apr 5, 2021

NTA DU Recruitment 2021 | నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA 1145 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

నిరుద్యోగులకు శుభవార్త. ఢిల్లీ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA మళ్లీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. గతంలో ఢిల్లీ యూనివర్సిటీలో 1145 నాన్ టీచింగ్ పోస్టులతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌కు 2021 మార్చి 16 వరకు దరఖాస్తుల్ని స్వీకరించింది. ఇప్పుడు దరఖాస్తు విండోను మరోసారి రీఓపెన్ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. గతంలో దరఖాస్తు చేయలేకపోయినవారు 2021 ఏప్రిల్ 28 వరకు దరఖాస్తు చేయొచ్చు. గతంలో దరఖాస్తు చేసినవాళ్లు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ https://recruitment.nta.nic.in/ లేదా ఢిల్లీ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ http://www.du.ac.in/ చూడాలి. అప్లై చేయడానికి ముందు నోటిఫికేషన్ చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

 Budget Smartphones: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.15,000 లోపు బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Amazon Headset days. 7th to 9th April. Starting from Rs.149

NTA DU Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే

  • జూనియర్ అసిస్టెంట్ - 236
  • టెలిఫోన్ ఆపరేటర్ - 08
  • అసిస్టెంట్ - 80
  • స్టెనోగ్రాఫర్ - 77
  • యోగా ఆర్గనైజర్ - 01
  • సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ - 05
  • నర్స్ - 07
  • అసిస్టెంట్ మేనేజర్ గెస్ట్ హౌస్ - 01
  • జూనియర్ ఇంజనీర్ సివిల్ - 05
  • జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ - 05
  • అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ - 04
  • సీనియర్ అసిస్టెంట్ - 45
  • హిందీ ట్రాన్స్‌లేటర్ - 02
  • పర్సనల్ అసిస్టెంట్ - 09
  • ప్రొఫెషనల్ అసిస్టెంట్ - 16
  • సోషల్ వర్కర్- 03
  • ఫిజియోథెరపిస్ట్ - 02
  • ఎక్స్-రే టెక్నీషియన్ - 02
  • హార్టికల్చరిస్ట్- 01
  • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ డిపార్ట్‌మెంట్ - 58
  • అసిస్టెంట్ ఆర్కైవిస్ట్ - 01
  • స్పోర్ట్ కోచ్ - 01
  • సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ - 17
  • ఫార్మసిస్ట్ - 05
  • టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ - 19
  • టెక్నికల్ అసిస్టెంట్ హెల్త్ సెంటర్ - 02
  • స్టాటిస్టికల్ అసిస్టెంట్ - 2
  • టెక్నికల్ అసిస్టెంట్ విభాగం - 51
  • శానిటరీ ఇన్‌స్పెక్టర్ - 01
  • తబ్లా సహచరులు - 12
  • పఖావాజ్ ప్లేయర్ - 01
  • సారంగి సహాయకులు - 02
  • వయోలిన్ సహాయకులు - 02
  • మృదంగం సహచరులు - 01
  • హార్మోనియం సహాయకులు - 01
  • తన్పుర సహచరులు - 04
  • ల్యాబరేటరీ అసిస్టెంట్ - 53
  • వర్క్ అసిస్టెంట్ - 03
  • అసిస్టెంట్ స్టోర్ - 02
  • సేల్స్ మాన్ DHMI- 02
  • లైబ్రరీ అసిస్టెంట్ -05
  • ప్రైవేట్ సెక్రెటరీ - 02
  • సెక్యూరిటీ ఆఫీసర్ - 01
  • జూనియర్ అసిస్టెంట్ స్టోర్ - 1
  • జూనియర్ వర్క్ అసిస్టెంట్ (ఇంజనీరింగ్ సర్వీస్) - 35
  • లైబ్రరీ అటెండెంట్ - 109
  • హెల్త్ అటెండెంట్ - 18
  • ల్యాబరేటరీ అటెండెంట్ - 152
  • ఇంజనీరింగ్ అటెండెంట్ - 52
  • మెడికల్ ఆఫీసర్ - 15
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 06

NTA DU Recruitment 2021: Important Dates

  • దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 28 రాత్రి 11.50 గంటలు
  • దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2021 ఏప్రిల్ 29
  • దరఖాస్తులో తప్పులు సరిదిద్దుకోవడానికి- 2021 ఏప్రిల్ 30 నుంచి మే 2
  • అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్- తేదీలను త్వరలో వెల్లడించనున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
  • ఆన్‌లైన్ టెస్ట్- తేదీలను త్వరలో వెల్లడించనున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ

NTA DU Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

  • విద్యార్హతలు- ఇంటర్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
  • వయస్సు- పోస్టుల వారీగా అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకు వేర్వేరుగా ఉంది.
  • ఎంపిక విధానం- ఆన్‌లైన్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్
  • దరఖాస్తు ఫీజు- జనరల్, అన్‌రిజర్వ్‌డ్ అభ్యర్థులకు రూ.1000. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600.
logoblog

Thanks for reading NTA DU Recruitment 2021@1145 Vacancies

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...