Indian Army Recruitment Rally 2021 | భారతీయ ఆర్మీ గుంటూరులో రిక్రూట్‌మెంట్ ర్యాలీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.
Amazon: SmartPhone Upgrade Sale
Best Smartphones under Rs 10000: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.10,000 లోపు బెస్ట్ 9 స్మార్ట్‌ఫోన్స్ ఇవే
1. ఇండియన్ ఆర్మీ గుంటూరులో రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనుంది. గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ 2021 మే 16 నుంచి మే 30 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించబోతున్నట్టు హెడ్‌క్వార్డర్స్ రిక్రూటింగ్ జోన్, చెన్నై ప్రకటించింది.
2. గుంటూరులోని బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపూర్, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల అభ్యర్థులు ఈ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరుకావొచ్చు.
Amazon Tv Upgrade Sale: UP TO 40% OFF
3. ఈ ర్యాలీ ద్వారా ఇండియన్ ఆర్మీలో సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ, సోల్జర్ క్లర్త్, స్టోర్ కీపర్ టెక్నికల్, సోల్జర్ ట్రేడ్స్‌మ్యాన్ పోస్టుల్ని భర్తీ చేయనుంది భారతీయ ఆర్మీ.
4. ఈ ర్యాలీలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 2021 ఏప్రిల్ 30 లోగా అప్లై చేయాలి. అడ్మిట్ కార్డులు 2021 మే 1న విడుదలౌతాయి.
5. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. 8వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్ పాసైనవారు ర్యాలీలో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకోవచ్చు. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
6. ఈ ర్యాలీకి దరఖాస్తు చేయడానికి అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో JCO/OR ఎన్‌రోల్‌మెంట్‌లో Apply /Login పైన క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి.
Amazon: SmartPhone Upgrade Sale
Best Smartphones under Rs 10000: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.10,000 లోపు బెస్ట్ 9 స్మార్ట్‌ఫోన్స్ ఇవే
7. అభ్యర్థులు తమ పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. సేవ్ చేసి సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఐడీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. డ్యాష్ బోర్డ్‌లో దరఖాస్తు చేయాలనుకున్న పోస్టును ఎంచుకోవాలి. నియమనిబంధనలన్నీ పూర్తిగా చదవాలి.
Amazon Tv Upgrade Sale: UP TO 40% OFF
8. వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసి సేవ్ చేసి కంటిన్యూ చేయాలి. ఆ తర్వాత కమ్యూనికేషన్ వివరాలు ఎంటర్ చేయాలి. స్పోర్ట్స్, ఎన్‌సీసీ కోటా వర్తిస్తే ఆ వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి. విద్యార్హతల వివరాలు, మార్కులు ఎంటర్ చేయాలి.
9. ఓసారి మీ వివరాలన్నీ సరిచూసుకొని సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత రోల్ నెంబర్ జనరేట్ అవుతుంది. దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. ర్యాలీకి 10 నుంచి 15 రోజుల ముందు లాగిన్ అయి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
10. ర్యాలీ జరిగే తేదీ, సమయం, వేదిక, నియమనిబంధనలు, ఇతర వివరాలన్నీ అడ్మిట్ కార్డులో ఉంటాయి. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ తీసుకొని ర్యాలీ జరిగే స్థలానికి రావాలి. ర్యాలీలో పాల్గొనడానికి ముందే ప్రైమరీ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
Amazon: SmartPhone Upgrade Sale
No comments:
Post a Comment