Baal Aadhaar: అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా ఆధార్ ను అందించే అవకాశాన్ని (UIDAI) కల్పించింది. ఈ ఆధార్ కార్డుకు ప్రత్యేక పేరుతో పాటు కలర్ కూడా ఉంటుంది. ఆ కార్డుకు సంబంధించిన ఫన్నీ విషయాలు మీ కోసమే..
ఆధార్ కార్డ్ ఈ రోజుల్లో మనకు అత్యంత ముఖ్యమైన ధ్రువపత్రంగా మారింది. ప్రతీ ఒక్కరూ ఆధార్ తప్పని సరిగా కలిగి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతర ఏ ధ్రువపత్రం కావాలన్నా, ఏ ప్రభుత్వ పథకానికి అప్లై చేయాలన్నా, బ్యాంకు ఖాతా తెరవాలన్నా కూడా ఆధార్ నంబర్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆఖరికి కరోనా టెస్టులు చేయాలన్నా, ఇప్పుడు వ్యాక్సినేషన్ చేయించుకోవాలన్నా కూడా ఆధార్ ను వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆధార్ లో మన బయోమెట్రిక్ డేటా కూడా నిక్షిప్తమై ఉంటుంది. అయితే అప్పుడే పుట్టిన బిడ్డకు కూడా ఆధార్ కార్డు తీసుకునే సదుపాయాన్ని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) కల్పించింది. ఇలా చిన్న పిల్లలకు ఇచ్చే ఆధార్ కార్డుకు ప్రత్యేకమైన పేరు పెట్టారు అధికారులు. దాని పేరు బాల ఆధార్(Baal Aadhaar). అయితే.. సాధారణ కార్డుతో పోల్చితే ఈ బాల ఆధార్ కార్డు కోసం ఎన్ రోల్మెంట్ చేయించుకోవాలన్నా, అప్ డేట్ చేయించుకోవాలన్నా కొన్ని విభిన్న పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది. ఈ ఆధార్ కార్డు కూడా సపరేట్ రంగులో ఉంటుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
Budget Smartphones: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.15,000 లోపు బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్ ఇవే
Amazon Headset days. 7th to 9th April. Starting from Rs.149
బాల ఆధార్ కార్డు గురించి కొన్ని ఆసక్తికరమైన, అవసరమైన విషయాలు మీ కోసం
1. ఐదేళ్ల లోపు పిల్లలకు బ్లూ కలర్ బాల ఆధార్ కార్డు(blue-colored Baal Aadhaar)ను ప్రభుత్వం అందిస్తుంది. అయితే పిల్లలకు ఐదేళ్ల వయస్సు వచ్చిన అనంతరం ఆ కార్డు పని చేయదు.
2.ఈ ఆధార్ కోసం ఎన్ రోల్మెంట్ చేసుకోవడానికి పిల్లల స్కూల్ ఐడీని కూడా ప్రూఫ్ గా వినియోగించవచ్చు.
3.మీ పిల్లలకు ఐదేళ్లు వచ్చిన సమయంలో ఓ సారి, 15 ఏళ్లు వచ్చిన సమయంలో బయో మెట్రిక్ ఆధార్ డేటాను అప్ డేటా చేయించాలన్న విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు.
4.మీ పిల్లల బర్త్ సర్టిఫికేట్ లేదా డెలివరీ అనంతరం హాస్పటల్ నుంచి పొందిన డిశ్చార్జ్ సర్టిఫికేట్ తో కూడా ఆధార్ ను ఎన్ రోల్మెంట్ చేయించుకోవచ్చు.
5.మీ పిల్లల ఆధార్ డేటాలో ఫింగర్ ప్రింట్స్ లాంటి బయోబెట్రిక్ సమాచారం ఉండదు. ఒక సారి మీ పిల్లలు ఐదేళ్లు దాటిన అనంతరం బయోమెట్రిక్ డేటాను అప్ డేట్ చేయించాల్సి ఉంటుంది.
Budget Smartphones: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.15,000 లోపు బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్ ఇవే
No comments:
Post a Comment