NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Mar 4, 2021

HPCL Recruitment 2021 @200 Vacancies

  SSK       Mar 4, 2021

నిరుద్యోగులకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనాలు అందించునున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఆయా పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.

Amazon: SmartPhone Upgrade Sale

 Best Smartphones under Rs 10000: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.10,000 లోపు బెస్ట్ 9 స్మార్ట్‌ఫోన్స్ ఇవే

ఖాళీలు విద్యార్హతల వివరాలు:

ఏఐసీటీఈ నుంచి అప్రూవల్ పొందిన లేదా యూజీసీ గుర్తింపు పొందిన కాలేజీల్లో నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సు చేసిన వారు ఆయా పోస్టులకు అప్లై చేయడానికి అర్హులని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

  • మెకానికల్ ఇంజనీర్ విభాగంలో మొత్తం 120 ఖాళీలు ఉన్నాయి. మెకానికల్ లేదా మెకానికల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.
  • సివిల్ ఇంజనీర్ విభాగంలో మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.
  • ఎలక్ట్రికల్ ఇంజనీర్ విభాగంలో మరో 25 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.
  • ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ విభాగంలో 25 పోస్టులను భర్తీ చేస్తున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
  • అభ్యర్థుల వయోపరిమితిని 25 ఏళ్లుగా నిర్ణయించారు.
  • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక నిర్వహించనున్నారు.

ఎలా అప్లై చేయాలంటే:

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో మార్చి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 15 వరకు అధికారిక వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు రూ. 1180ని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజుల్లో కొన్ని వర్గాల వారికి మినహాయింపు ఇచ్చారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

Official Notification-Direct Link

logoblog

Thanks for reading HPCL Recruitment 2021 @200 Vacancies

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...