ECIL Hyderabad Recruitment 2021 | హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. తాజాగా మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 9 ఖాళీలున్నాయి. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ యూనిట్‌లో ఈ ఖాళీలున్నాయి. ఇవి ఏడాది గడువున్న కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఆ తర్వాత ప్రాజెక్ట్ అవసరాలను బట్టి గడువు పొడిగించే అవకాశం ఉంది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతల వివరాలు తెలుసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2021 మార్చి 18 లోగా దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://www.ecil.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి.
ECIL Hyderabad Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే
మొత్తం ఖాళీలు- 9
- టెక్నికల్ ఆఫీసర్- 8
- సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ- 1
DSSSB Recruitment 2021 @1809 Vacancies
NTA DU Recruitment 2021@1145 Vacancies
ECIL Hyderabad Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- దరఖాస్తు ప్రారంభం- 2021 మార్చి 4
- దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 18
- డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ- తేదీలను త్వరలో వెల్లడించనున్న ఈసీఐఎల్
- విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి.
- వేతనం- టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు రూ.23,000, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ పోస్టుకు రూ.20,202.
- వయస్సు- టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు 30 ఏళ్లు, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ పోస్టుకు 25 ఏళ్లు.
ESIC Recruitment 2021 @6552 Vacancies
ECIL Hyderabad Recruitment 2021: అప్లై చేయండి ఇలా
- అభ్యర్థులు ముందుగా http://www.ecil.co.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- Careers సెక్షన్‌లో e‐Recruitment పైన క్లిక్ చేయాలి.
- అందులో నోటిఫికేషన్ సెలెక్ట్ చేయాలి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Apply for Various Posts పైన క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత దరఖాస్తు చేయాలనుకునే పోస్టు సెలెక్ట్ చేయాలి.
- మీ పేరు, అడ్రస్, విద్యార్హతలు, ఇతర వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
- దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
No comments:
Post a Comment