- రాష్ట్రంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు-AS Of Now Updated Information
- జోరు చూపుతున్న అధికార వైసీపీ
- కార్పొరేషన్లలో వైసీపీ హవా
- ఢీలాపడిపోయిన టీడీపీ, జనసేన
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అధికార వైసీపీకే ప్రజలు పట్టం కట్టినట్టు ట్రెండ్స్ చెబుతున్నాయి. టీడీపీ అనేక చోట్ల ఉనికి చాటుకున్నా, వైసీపీ ప్రభంజనం ముందు అది చాలా స్వల్పం అని చెప్పాలి. జనసేన పార్టీ పలు ప్రాంతాల్లో విజయాలు సాధించడం ఆ పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్నిస్తుందనడంలో సందేహం లేదు.
ఇక, కార్పొరేషన్ల వారీగా ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలు ఇలా ఉన్నాయి....
- విజయవాడ (64)-వైసీపీ 23, టీడీపీ 10
- గుంటూరు (57)-వైసీపీ 44, టీడీపీ 9, జనసేన 2
- విశాఖపట్నం (98)-వైసీపీ 58, టీడీపీ 30, జనసేన 4, ఇతరులు 6
- ఒంగోలు (50)- వైసీపీ 41, టీడీపీ 6, జనసేన 1, ఇతరులు 2
- చిత్తూరు (50)- వైసీపీ 46, టీడీపీ 3, ఇతరులు 1
- తిరుపతి (50)- వైసీపీ 47, టీడీపీ 1
- కడప (50)- వైసీపీ 27... ఇతర పార్టీలు ఇంకా బోణీ చేయలేదు.
- కర్నూలు (52)- వైసీపీ 41, టీడీపీ 8, ఇతరులు 3
- అనంతపురం (50)- వైసీపీ 48, ఇతరులు 2
- విజయనగరం (50)- వైసీపీ 24, టీడీపీ 1
- మచిలీపట్నం (50)- వైసీపీ 14, టీడీపీ 2, జనసేన 1
No comments:
Post a Comment