Wakefit Sleep Internship | కాలు కదపకుండా సంపాదిస్తున్నారని, కూర్చొని సంపాదిస్తున్నారని మీరు వినే ఉంటారు కదా? నిద్రపోతూ కూడా సంపాదించొచ్చు. ఈ మంచి అవకాశం వచ్చేసింది. ఎలాగో తెలుసుకోండి.
1. రోజూ 9 గంటల చొప్పున 100 రోజులు నిద్రపోతే రూ.10,00,000 గెలుచుకోవచ్చు. ఈ ఉద్యోగం ఏదో బాగుందనుకుంటున్నారు కదా? మ్యాట్రెసెస్ తయారు చేసే స్టార్టప్ Wakefit అందిస్తున్న అవకాశం ఇది. వేక్‌ఫిట్ స్లీప్ ఇంటర్న్స్ 2021-22 బ్యాచ్ కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.
2. దరఖాస్తుల్ని షార్ట్ లిస్ట్ చేసి కొందర్ని స్లీప్ ఇంటర్న్స్‌గా ఎంపిక చేస్తారు. వాళ్లు చేయాల్సిన పనేమీ ఉండదు. రోజూ 9 గంటలు నిద్రపోవాలి. 100 రోజులు సక్సెస్‌ఫుల్‌గా రోజూ 9 గంటల చొప్పున నిద్రపోతే చాలు.
3. ఇంటర్న్‌షిప్ విజయవంతంగా పూర్తి చేసిన వారిని స్లీప్ ఛాంపియన్‌గా గుర్తించి రూ.10,00,000 ఇస్తారు. ఇక స్లీప్ ఇంటర్న్‌గా ఎంపికైన ప్రతీ ఒక్కరికి రూ.1,00,000 చొప్పున ఇస్తారు. అంటే స్లీప్ ఇంటర్న్‌గా ఎంపికైతే చాలు రూ.1,00,000 గ్యారెంటీ.
4. ఏదైనా డిగ్రీ పాస్ అయినవారు ఎవరైనా స్లీప్ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు. కేవలం 10 నుంచి 20 నిమిషాల్లో నిద్రపోగలగాలి. అర్ధరాత్రి వరకు మెళకువగా ఉండే అలవాటు ఉండకూడదు. ఎక్కువగా కెఫీన్, ఆల్కహాల్ తీసుకోకూడదు.
5. ఫిట్‌నెస్ పాటిస్తే మంచిది. నిద్రకు సంబంధించిన టిప్స్ తెలిసి ఉండాలి. ఇలాంటి అర్హతలు మీకు ఉన్నాయంటే ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. 100 రోజుల పాటు రోజూ 9 గంటల చొప్పున నిద్రపోయి రూ.10,00,000 సొంతం చేసుకోవచ్చు.
6. ఎంపికైనవారికి వేక్‌ఫిట్ మ్యాట్రెస్ ఇస్తారు. దానిపైనే నిద్రపోవాలి. యాప్ ద్వారా నిద్రను ట్రాక్ చేస్తారు. ఈ ఉద్యోగం చేయడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంటి నుంచే ఈ పనిచేయొచ్చు.
7. మరి ఈ స్లీప్ ఇంటర్న్‌షిప్‌కు ఎలా దరఖాస్తు చేయాలని అనుకుంటున్నారా? https://wakefit.co/sleepintern/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు ఉంటాయి. ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి.
8. వేక్‌ఫిట్ స్లీప్ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసే ముందు ఓసారి అన్ని వివరాలు పూర్తిగా చదివి, అసలు ఈ ఉద్యోగం ఏంటో తెలుసుకోవడం మంచిది.
No comments:
Post a Comment