RBI Grade B Recruitment 2021
1. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI గ్రేడ్ బీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. గ్రేడ్ బీ (DR) జనరల్, గ్రేడ్ బీ (DR) డీఈపీఆర్, గ్రేడ్ బీ (DR) డీఎస్ఐఎం పోస్టులున్నాయి. మొత్తం 322 ఖాళీలను ప్రకటించింది.
2. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://www.rbi.org.in/ లేదా https://opportunities.rbi.org.in/ వెబ్‌సైట్ చూడొచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
3. మొత్తం 322 ఖాళీలు ఉండగా అందులో గ్రేడ్ బీ (DR) జనరల్- 270, గ్రేడ్ బీ (DR) డీఈపీఆర్- 29, గ్రేడ్ బీ (DR) డీఎస్ఐఎం- 23 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 15 చివరి తేదీ.
4. గ్రేడ్ బీ (DR) జనరల్ ఫేజ్ 1 ఆన్‌లైన్ ఎగ్జామ్ 2021 మార్చి 6న, గ్రేడ్ బీ (DR) జనరల్ ఫేజ్ 2 ఆన్‌లైన్ ఎగ్జామ్ 2021 ఏప్రిల్ 1న, గ్రేడ్ బీ (DR) డీఈపీఆర్ ఫేజ్ 1 ఆన్‌లైన్ ఎగ్జామ్ 2021 మార్చి 6న, గ్రేడ్ బీ (DR) డీఈపీఆర్ ఫేజ్ 2 ఆన్‌లైన్ లేదా రాతపరీక్ష 2021 మార్చి 31న, గ్రేడ్ బీ (DR) డీఎస్ఐఎం ఫేజ్ 1 ఆన్‌లైన్ ఎగ్జామ్ 2021 మార్చి 6న, గ్రేడ్ బీ (DR) డీఎస్ఐఎం ఫేజ్ 2 ఆన్‌లైన్ లేదా రాతపరీక్ష 2021 మార్చి 31న ఉంటుంది.
5. విద్యార్హతల వివరాలు చూస్తే గ్రేడ్ బీ (DR) జనరల్ పోస్టులకు బ్యాచిలర్స్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉండాలి. టెన్త్, ఇంటర్‌లో 60 శాతం మార్కులు ఉండాలి. గ్రేడ్ బీ (DR) డీఎస్ఐఎం పోస్టులకు స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ ఎకనమిక్స్, ఎకనమెట్రిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫమెటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి.
6. గ్రేడ్ బీ (DR) డీఈపీఆర్ పోస్టులకు ఎకనమిక్స్, ఎకనమెట్రిక్స్, క్వాంటిటేటీవ్ ఎకనమిక్స్, మ్యాథమెటికల్ ఎకనమిక్స్, ఇంటిగ్రేటెడ్ ఎకనమిక్స్ కోర్స్, ఫైనాన్స్‌లో 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి. లేదా పీజీడీఎం, ఎంబీఏ ఫైనాన్స్ 55 శాతం మార్కులతో పాస్ కావాలి.
7. అభ్యర్థులు ముందుగా https://www.rbi.org.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత హోమ్ పేజీలో కింది వైపు Opportunities@RBI పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Current Vacancies పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Vacancies పైన క్లిక్ చేయాలి. Recruitment of Officers in Grade B- DR (General), DEPR/DSIM-2021 లింక్ పైన క్లిక్ చేయాలి.
8. ఓసారి నియమనిబంధనలన్నీ పూర్తిగా చదవాలి. ONLINE application పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో NEW REGISTRATION పైన క్లిక్ చేయాలి. పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, అడ్రస్ లాంటి వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్టెప్‌లో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
9. ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసిన తర్వాత విద్యార్హతలు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రివ్యూ చూసుకోవాలి. తప్పులు ఏవైనా ఉంటే సరిచేయాలి. ఆ తర్వాత save and next పైన క్లిక్ చేయాలి. దరఖాస్తు ఫీజు చెల్లించిన Final Submit బటన్ పైన క్లిక్ చేయాలి.
10. మీ అప్లికేషన్ ఫామ్ విజయవంతంగా సబ్మిట్ అవుతుంది. అప్లికేషన్ వివరాలు ఎస్ఎంఎస్, ఇమెయిల్‌లో వస్తాయి. దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.
No comments:
Post a Comment