SECR Recruitment 2021 | రైల్వేలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. భారతీయ రైల్వే పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. దరఖాస్తు గడువు త్వరలో ముగియనుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
1. భారతీయ రైల్వే ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగ్నేయ మధ్య రైల్వే స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు కాబట్టి ఆయా క్రీడల్లో రాణించినవారు మాత్రమే దరఖాస్తు చేయాలి.
2. మొత్తం 26 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 23 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://secr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
3. మొత్తం ఖాళీలు 26 ఉన్నాయి. అందులో ఆర్చరీ (మెన్)- 1, ఆర్చరీ (వుమెన్)- 1, అథ్లెటిక్స్ (మెన్)- 1, అథ్లెటిక్స్ (వుమెన్)- 1, బాస్కెట్ బాల్ (వుమెన్)- 3, బాక్సింగ్ (వుమెన్)- 3, క్రాస్ కంట్రీ (మెన్)- 1, క్రాస్ కంట్రీ (వుమెన్)- 1, ఫుట్ బాల్ (మెన్)- 4, గోల్ఫ్ (మెన్)- 2, హ్యాండ్‌బాల్ (వుమెన్)- 3, ఖోఖో (మెన్)- 3, పవర్ లిఫ్టింగ్ (మెన్)- 1, వెయిట్ లిఫ్టింగ్ (వుమెన్)- 1 పోస్టులున్నాయి.
4. విద్యార్హతల వివరాలు చూస్తే వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. 10వ తరగతి, ఐటీఐ, డిగ్రీ పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. 3. దరఖాస్తు చేసేముందు ఇదే వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు, ఇతర అర్హతల వివరాలను తెలుసుకోవాలి.
5. స్పోర్ట్స్ అర్హతలు చూస్తే కేటగిరీ ఏ: ఒలింపిక్ క్రీడలు (సీనియర్ కేటగిరీ), కేటగిరీ బీ: ప్రపంచ కప్ (జూనియర్ యూత్ / సీనియర్ కేటగిరీ), ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు (జూనియర్ / సీనియర్ కేటగిరీ), ఆసియా గేమ్స్ (సీనియర్ కేటగిరీ), కామన్వెల్త్ గేమ్స్ (సీనియర్ కేటగిరీ), యూత్ ఒలింపిక్స్, డేవిస్ కప్ (టెన్నిస్), ఛాంపియన్స్ ట్రోఫీ (హాకీ) , థామస్ కప్ ఐబర్ కప్ (బ్యాడ్మింటన్) అర్హతలుండాలి.
6. ఇక కేటగిరీ సీ- కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్స్ (జూనియర్ / సీనియర్ కేటగిరీ), ఆసియా ఛాంపియన్‌షిప్స్ / ఆసియా కప్ (జూనియర్ / సీనియర్ కేటగిరీ), సౌత్ ఏషియన్ ఫెడరేషన్స్ (SAF) గెయిన్స్ (సీనియర్ కేటగిరీ), USIC (వరల్డ్ రైల్వే) ఛాంపియన్‌షిప్స్ (సీనియర్ కేటగిరీ), వాల్డ్ యూనివర్సిటీ గేమ్స్ అర్హతలు ఉండాలి.
7. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, వుమెన్ అభ్యర్థులకు రూ.250.
Amazon FAB PHONES FEST- UPTO 40% OFF on SmartPhones
No comments:
Post a Comment