PGCIL Recruitment 2021
Recruitment of ET 26th batch through GATE 2021. Advt No. CC/06/2020 dated 06.10.2020
1. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-PGCIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల్లో ఫ్రెషర్స్‌ని నియమించుకోబోతోంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. గేట్ 2021 స్కోర్స్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది పీజీసీఐఎల్.
2. ఇప్పటికే గేట్ 2021 పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఈ పరీక్ష రాసే విద్యార్థులు పీజీసీఐఎల్‌లో ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు దరఖాస్తు చేయడానికి అర్హులు.
3. డీటెయిల్డ్ నోటిఫికేషన్ 2021 జనవరి 10న విడుదలవుతుంది. దరఖాస్తు ప్రక్రియ 2021 జనవరి 15న ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 15 చివరి తేదీ. అభ్యర్థులు గేట్ 2021 ఎగ్జామ్‌తో పాటు పీజీసీఐఎల్ రిక్రూట్‌మెంట్‌కు వేర్వేరుగా దరఖాస్తు చేయాలన్న విషయం గుర్తుంచుకోవాలి.
4. ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టులకు శిక్షణ పూర్తైన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ హోదాలో నియమించనుంది ఈ సంస్థ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు పీజీసీఐఎల్ అధికారిక వెబ్‌సైట్ https://www.powergridindia.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
5. విద్యార్హతల వివరాలు చూస్తే ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ (పవర్), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్), ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్, టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజనీరింగ్ పాస్ కావాలి. గేట్ 2021 స్కోర్ తప్పనిసరి.
6. దరఖాస్తు ఫీజు రూ.500. గేట్ 2021 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి వేతనం రూ.60,000 నుంచి రూ.1,80,000 లభిస్తుంది. అభ్యర్థుల వయస్సు 2020 డిసెంబర్ 31 నాటికి 28 ఏళ్ల లోపు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
7. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన మహారత్న ఎంటర్‌ప్రైజ్. ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌ను కంట్రోల్ చేస్తుంది. 248 సబ్‌స్టేషన్స్ పరిధిలో 164,115 సర్క్యుట్ కిలోమీటర్ల నెట్వర్క్ ఉంది. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో సుమారు 50 శాతం ఈ సంస్థ మేనేజ్ చేస్తుంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు భారతదేశంలో 206 నగరాల్లో 714 ప్రాంతాలు కవర్ అయ్యేలా 66,922 కిలోమీటర్ల టెలికాం నెట్వర్క్ కూడా ఉంది.
No comments:
Post a Comment