NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Feb 15, 2021

National Testing Agency Recruitment 2021

  SSK       Feb 15, 2021

NTA Recruitment 2021: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో జాబ్స్.. దరఖాస్తుకు 3 రోజులే గడువు

National Testing Agency Recruitment 2021 jobs.nta.ac.in: National Testing Agency (NTA), Noida, Uttar Pradesh invites online applications for recruitment of following Directors, Programmer, Scientist, Superintendent, Stenographer, Assistant Technician positions on Contractual / Deputation Basis. The last date for submission of online applications is 18th February 2021.

NTA Recruitment 2021 | నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA 58 ఖాళీలను భర్తీ చేస్తోంది. అప్లై చేయడానికి మరో 3 రోజులే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

1. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ప్రోగ్రామర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 58 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 18 చివరి తేదీ. 

2. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్ https://nta.ac.in/ లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసేముందు విద్యార్హతల వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి. నోటిఫికేషన్ ఇదే వెబ్‌సైట్‌లో ఉంటుంది.

3. మొత్తం 58 ఖాళీలు ఉండగా అందులో జాయింట్ డైరెక్టర్- 4, డిప్యూటీ డైరెక్టర్- 4, అసిస్టెంట్ డైరెక్టర్- 3, సీనియర్ ప్రోగ్రామర్- 2, ప్రోగ్రామర్- 3, సీనియర్ సూపరింటెండెంట్- 6, స్టెనోగ్రాఫర్- 9, సీనియర్ అసిస్టెంట్ లేదా సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్)- 6, అసిస్టెంట్ లేదా అసిస్టెంట్ (అకౌంట్స్)- 8, జూనియర్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్)- 3, సీనియర్ టెక్నీషియన్- 3, జూనియర్ టెక్నీషియన్- 5, రీసెర్చ్ సైంటిస్ట్ ఏ అండ్ సీ- 2 పోస్టులున్నాయి. 

4. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.800. 

5. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా https://jobs.nta.ac.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత Register పైన క్లిక్ చేయాలి.

ఫస్ట్ టైమ్ యూజర్ అయితే Signup here పైన క్లిక్ చేయాలి. మీ వివరాలన్నీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి.

6. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఇమెయిల్, మొబైల్ నెంబర్ వస్తుంది. మీ వివరాలతో లాగిన్ అయిన తర్వాత అడ్రస్, ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్‌పీరియెన్స్ లాంటి వివరాలు అప్‌డేట్ చేయాలి. ఆ తర్వాత యాక్టీవ్ జాబ్స్ పైన క్లిక్ చేయాలి. సెల్ఫ్ డిక్లరేషన్ యాక్సెప్ట్ చేసి ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

logoblog

Thanks for reading National Testing Agency Recruitment 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...