Indian Army Recruitment Rally 2021
Indian Army Recruitment Rally 2021: విశాఖపట్నం ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయం ఆర్మీ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో ఏపీ అభ్యర్థులకు నియామక ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
విశాఖపట్నం ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయం ఆర్మీ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో ఏపీ అభ్యర్థులకు నియామక ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఏపీకి చెందిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా తదితర జిల్లాలు, యానాంకు చెందిన అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొనవచ్చని తెలిపింది.
ఇంటర్ తో పాటు కనీసం 55% మార్కులతో డి ఫార్మా లేదా కనీసం 50% మార్కులతో బీ ఫార్మసీలో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు. స్టేట్ ఫార్మసీ కౌన్సిల్/ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అభ్యర్థులు రిజిస్టర్ అయి ఉండాలి.
అభ్యర్థులు 01 అక్టోబర్ 1995 - 01 అక్టోబరు 2001 మధ్య జన్మించి ఉండాలి. వయస్సు 19-25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపికను నిర్వహించనున్నారు.
ర్యాలీని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్, హకీంపేట్ లో 05 మార్చి నుంచి అదే నెల 24 వరకు నిర్వహించనున్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 28 వ తేదీలోగా ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు http://www.joinindianarmy.nic.in/default.aspx ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోవాలి.
No comments:
Post a Comment