NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Feb 27, 2021

Indian Army Recruitment 2021

  SSK       Feb 27, 2021

Indian Army TGC 133 Recruitment 2021 | బీటెక్, ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయినవారికి, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారికి ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు ఉన్నాయి. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

బీటెక్ పాస్ అయినవారికి, ఇంజనీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారికి గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ 133 టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ (TGC-133) రిక్రూట్‌మెంట్ 2021 నోటిఫికేషన్ విడుదలైంది. బీటెక్ పాస్ అయినవారి నుంచి దరఖాస్తుల్ని కోరుతోంది ఇండియన్ ఆర్మీ. మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి. పెళ్లికాని యువకులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 మార్చి 26 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఎంపికైనవారు శిక్షణ కోసం 2021 జనవరిలో డెహ్రడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరాలి. ప్రభుత్వ ఖర్చులతో 49 వారాల శిక్షణ లభిస్తుంది.

Indian Army TGC 133 Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే

మొత్తం ఖాళీలు- 40

  • సివిల్ లేదా బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ- 11
  • ఆర్కిటెక్చర్- 1
  • ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్- 4
  • కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్- 9
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 3
  • ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్- 2
  • టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 1
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్- 1
  • శాటిలైట్ కమ్యూనికేషన్- 1
  • ఏరోనాటికల్ లేదా ఏరోస్పేస్ లేదా ఏవియానిక్స్- 3
  • ఆటోమొబైల్ ఇంజనీరింగ్- 1
  • టెక్స్‌టైల్ ఇంజనీరింగ్- 1

Indian Army TGC 133 Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

  • దరఖాస్తు ప్రారంభం- 2021 ఫిబ్రవరి 25
  • దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 26 మధ్యాహ్నం 3 గంటలు
  • విద్యార్హతలు- సంబంధిత బ్రాంచ్‌లో బీటెక్ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పాస్ కావాలి. ఇంజనీరింగ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేయొచ్చు.
  • వయస్సు- 2021 జూలై 1 నాటికి 20 నుంచి 27 ఏళ్లు
  • శిక్షణా కాలం- 49 వారాలు
  • క్యాడెట్ ట్రైనింగ్ స్టైపెండ్- రూ.56,100

Indian Army TGC 133 Recruitment 2021: అప్లై చేయండి ఇలా

  • ముందుగా https://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
  • Officers Entry Login ట్యాబ్ పైన క్లిక్ చేయండి
  • ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ట్యాబ్ క్లిక్ చేయండి
  • అన్ని వివరాలు ఎంటర్ చేయండి
  • మీ ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయండి
  • దరఖాస్తులోని వివరాలన్నీ ఓసారి సరిచూసుకోండి
  • దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

logoblog

Thanks for reading Indian Army Recruitment 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...