NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Feb 19, 2021

Hyderabad Police Job Mela:15కు పైగా కంపెనీల్లో 2 వేలకు పైగా ఉద్యోగాలు.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

  SSK       Feb 19, 2021

Hyderabad Police Job Mela: హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో జాబ్ మేళా.. 15కు పైగా కంపెనీల్లో 2 వేలకు పైగా ఉద్యోగాలు.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

తెలంగాణ పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక సేవలోనూ ముందుంటున్నారు. పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైన సమయంలో అనేక మంది నిరుద్యోగులకు వివిధ పీఎస్ ల ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

తెలంగాణ పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక సేవలోనూ ముందుంటున్నారు. రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ ప్రత్యేకతను చాటుతున్నారు. పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైన సమయంలో అనేక మంది నిరుద్యోగులకు వివిధ పీఎస్ ల ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ అందించిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ ఆర్గనైజ్ చేయనుంది. Amwarlul Uloom College, Mallepally, Hyderabad చిరునామాలో ఈ నెల 20 న నిర్వహించనున్న ఈ జాబ్ మేళాలో 15కు పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. ఆయా కంపెనీల్లోని 2000లకు పైగా ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగం, కంపెనీ ఆధారంగా నెలకు రూ. 10 వేల నుంచి రూ. 30 వేలకు పైగా వేతనం అందించనున్నారు.

పది కన్నా తక్కువ తరగతి చదివిన వారితో పాటు పీజీ అర్హత కలిగిన వారి వరకు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్యూకు హాజరయ్యే అభ్యర్థులు మూడు కాపీల RESUME లను వెంట తీసుకురావాలని ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 8333900131, 9490157542 నంబర్లను సంప్రదించాలని సూచించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా కింద ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

Registration-Direct Link

ఈ నెల 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ జాబ్ మేళా జరగనుంది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. మాస్కు లేనిదే అభ్యర్థులను లోనికి అనుమతించబోమని నిర్వాహకులు స్పష్టం చేశారు. అభ్యర్థులంతా విధిగా మాస్కులు ధరించాలని, కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.

logoblog

Thanks for reading Hyderabad Police Job Mela:15కు పైగా కంపెనీల్లో 2 వేలకు పైగా ఉద్యోగాలు.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...