APSSDC Jobs: డిగ్రీ, బీటెక్ అర్హతతో Tech Mahindraలో ఉద్యోగాలు.. ఎల్లుండే ఇంటర్యూలు.. పూర్తి వివరాలివే
Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఆధ్వర్యంలో వివిధ సంస్థల్లో ఉద్యోగ నియామకాలకు వరుసగా ప్రకటనలు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ టెక్ మహింద్ర(Tech Mahindra)లో ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదలైంది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఆధ్వర్యంలో వివిధ సంస్థల్లో ఉద్యోగ నియామకాలకు వరుసగా ప్రకటనలు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ టెక్ మహింద్ర(Tech Mahindra)లో ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నెల్లూరు జిల్లాలోని Rao’s Degree College, 17/564, Opp. BSNL Office, VRC Centreలో ఈ నెల 21 ఉదయం 9 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.
విద్యార్హతల వివరాలు
ఈ ప్రకటన ద్వారా 100కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఏదైనా సబ్జెక్టుల్లో డిగ్రీ, బీటెక్ చేసిన వారు దరఖాస్తుకు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 2017, 18, 19, 20 సంవత్సరాల్లో పాసైన వారు ఇంటర్యూలకు హాజరు కావొచ్చు. చెన్నై, హైదరాబాద్ లొకేషన్లలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. చెన్నై లొకేషన్ కు ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ. 1.64 లక్షల వేతనం, హైదరాబాద్ లొకేషన్లో ఎంపికైన వారికి ఏడాదికి రూ. 1.50 లక్షల వేతనం చెల్లించనున్నారు. దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18-30 ఏళ్ల వయస్సు ఉండాలి. అభ్యర్థులకు ఇంగ్లిష్, తెలుగు, తమిళ భాషలపై అవగాహనతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
రిజిస్ట్రేషన్ ఇలా
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ అధికారిక వెబ్ సైట్ www.apssdc.in వెబ్ సైట్లో మొదట రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఏదైనా సందేహాలుంటే 9494456326, 9441522404 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
No comments:
Post a Comment