APSSDC Jobs in HBL Industries
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. HBL Industries లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ ప్రకటన విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 5 తేదీ ఉదయం 9 గంటలకు Miriam Degree College, Amalapuram లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ కు చెందిన అధికారిక వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
ఖాళీలు, అర్హతల వివరాలు.
ఈ ప్రకటన ద్వారా మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ(ఫిట్టర్, డీజిల్ మెకానిక్), డిప్లొమా, బీటెక్(మెకానికల్, ఎలక్ట్రికల్) విద్యార్హత కలిగిన వారు ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి. కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులని ప్రకటనలో స్పష్టం చేశారు. టెక్నికల్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12 వేల వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, ఫుడ్, వసతి సదుపాయం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు విజయనగరంలో పని చేయాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ఇలా
అభ్యర్థులు www.apssdc.in వెబ్ సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. JAM Session మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ జిరాక్స్ ను వెంట తీసుకురావాలని ప్రకటనలో సూచించారు. అభ్యర్థులు ఏమైనా సందేహాలంటే 9000831156, 7386706272 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
No comments:
Post a Comment