NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Jan 9, 2021

UPSC Recruitment 2021

  SSK       Jan 9, 2021

 UPSC Recruitment 2021: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్

UPSC_Recruitment_2021

UPSC Recruitment 2021 | కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

The Union Public Service Commission (UPSC) has released recruitment of candidates in the Civil Service (Preliminary) Examination 2021 like every year. The UPSC released the Exam Calendar 2021 on its official website – www.upsc.gov.in. The candidates who want to seek UPSC jobs can apply for it by filling the application form by the mentioned time duration. The applying candidates must ensure eligibility before submitting the form. The details of the examination like the UPSC 2021 Application Form, Examination Dates, Eligibility Criteria, Exam Pattern, etc are given in this article.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి మరో గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 56 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2021 జనవరి 28 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/ లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

UPSC Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 56

  • అసిస్టెంట్ డైరెక్టర్ (షిప్పింగ్)- 1
  • స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (డెర్మటాలజీ, వెనెరియాలజీ, లెప్రసీ)- 6
  • స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ)- 7
  • స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆప్తమాలజీ)- 13
  • స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆబ్‌స్టెట్రిక్స్, గైనకాలజీ)- 19
  • స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీడియాట్రిక్ కార్డియాలజీ)- 2
  • స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీడియాట్రిక్ సర్జరీ)- 1
  • స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్రక్టీవ్ సర్జరీ)- 6
  • అసిస్టెంట్ డైరెక్టర్ (బాలిస్టిక్స్)- 1


UPSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

  • దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 28
  • దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2021 జనవరి 29
  • విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
  • వయస్సు- గరిష్టంగా 35 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీస్ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • వేతనం- ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వ 7వ వేతన స్కేల్ వర్తిస్తుంది.


UPSC Recruitment 2021: అప్లై చేయండి ఇలా...

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.
  • విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో ONLINE RECRUITMENT APPLICATION (ORA) FOR VARIOUS RECRUITMENT POSTS పైన క్లిక్ చేయాలి.
  • అందులో వేర్వేరు పోస్టులకు వేర్వేరు లింక్స్ ఉంటాయి.
  • దరఖాస్తు చేయాలనుకున్న పోస్టుకు సంబంధించిన Apply Now లింక్ క్లిక్ చేయాలి.
  • ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

logoblog

Thanks for reading UPSC Recruitment 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...