NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Jan 20, 2021

NTA Recruitment 2021

  SSK       Jan 20, 2021

 NTA Recruitment 2021: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే...

NTA Recruitment 2021

NTA Recruitment 2021 | నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ప్రోగ్రామర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 58 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 18 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్ https://nta.ac.in/ లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసేముందు విద్యార్హతల వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి. నోటిఫికేషన్ ఇదే వెబ్‌సైట్‌లో ఉంటుంది.

NTA Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...

మొత్తం ఖాళీలు- 58

  • జాయింట్ డైరెక్టర్- 4
  • డిప్యూటీ డైరెక్టర్- 4
  • అసిస్టెంట్ డైరెక్టర్- 3
  • సీనియర్ ప్రోగ్రామర్- 2
  • ప్రోగ్రామర్- 3
  • సీనియర్ సూపరింటెండెంట్- 6
  • స్టెనోగ్రాఫర్- 9
  • సీనియర్ అసిస్టెంట్ లేదా సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్)- 6
  • అసిస్టెంట్ లేదా అసిస్టెంట్ (అకౌంట్స్)- 8
  • జూనియర్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్)- 3
  • సీనియర్ టెక్నీషియన్- 3
  • జూనియర్ టెక్నీషియన్- 5
  • రీసెర్చ్ సైంటిస్ట్ ఏ అండ్ సీ- 2

NTA Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

  • దరఖాస్తు ప్రారంభం- 2021 జనవరి 18
  • దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 18
  • విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
  • దరఖాస్తు ఫీజు- అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.800.

NTA Recruitment 2021: అప్లై చేయండి ఇలా

  • అభ్యర్థులు ముందుగా https://jobs.nta.ac.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • ఆ తర్వాత Register పైన క్లిక్ చేయాలి.
  • ఫస్ట్ టైమ్ యూజర్ అయితే Signup here పైన క్లిక్ చేయాలి.
  • మీ వివరాలన్నీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఇమెయిల్, మొబైల్ నెంబర్ వస్తుంది.
  • మీ వివరాలతో లాగిన్ అయిన తర్వాత అడ్రస్, ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్‌పీరియెన్స్ లాంటి వివరాలు అప్‌డేట్ చేయాలి.
  • ఆ తర్వాత యాక్టీవ్ జాబ్స్ పైన క్లిక్ చేయాలి.
  • సెల్ఫ్ డిక్లరేషన్ యాక్సెప్ట్ చేసి ఫీజు చెల్లించాలి.
  • దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

logoblog

Thanks for reading NTA Recruitment 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...